J&K DG ‌HK Lohia: జమ్మూ కాశ్మీర్‌లో క‌ల‌కలం .. జైళ్ల శాఖ డీజీపీ హెచ్‌కే లోహియా దారుణ హ‌త్య‌..

|

Oct 04, 2022 | 5:38 AM

ఈ ఘటనతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం నుంచి జమ్మూ కాశ్మీర్‌లో తన మూడు రోజుల పర్యటన ప్రారంభించారు.

J&K DG ‌HK Lohia: జమ్మూ కాశ్మీర్‌లో క‌ల‌కలం .. జైళ్ల శాఖ డీజీపీ హెచ్‌కే లోహియా దారుణ హ‌త్య‌..
Jammu And Kashmirs Ips Officer Hk Lohia
Follow us on

జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీ హెచ్‌కే లోహియా జమ్మూలోని ఉదయవాలాలోని తన ఇంట్లో శవమై కనిపించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, పోలీసులు లోహియా మృతదేహాన్ని అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. ఆశ్చర్యకరంగా, హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన కోసం జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నప్పుడే, ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఉన్నత అధికారి హత్య అనుమానాస్పదంగా మారింది. ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఒక పోలీసు అధికారి ఒక ప్రకటనలో మరణాన్ని ధృవీకరించారు. హత్య అనుమానాన్ని వ్యక్తం చేశారు. అతని స్థానిక సహాయకుడు ఘటనా స్థలం నుంచి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

స్థానిక వార్తా సంస్థ ప్రకారం, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ జైలు డీజీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ” జమ్మూ కాశ్మీర్ పోలీసు కుటుంబం తమ సీనియర్ అధికారి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది” అని ఆయన అన్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈ ఏడాది ఆగస్టులో జైలు డీజీగా నియమితులయ్యారు. స్థానిక మీడియా JK న్యూస్‌లైన్ వార్తా సంస్థ మాత్రం, సంఘటన స్థలం ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన అనుమానాస్పద హత్యగా తేల్చింది.

ఫోరెన్సిక్, క్రైమ్ బ్రాంచ్ బృందం సంఘటనా స్థలంలో పరిశీలనలు..

ఇవి కూడా చదవండి

జమ్మూ ఏడీజీపీ ముఖేష్ సింగ్ ఒక అధికారిక ప్రకటనలో, “హేమంత్ లోహియా జైలు డీజీ మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనుగొన్నాం. నేరస్థుల తొలి విచారణలో ఈ అనుమానాస్పద హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అధికారి ఇంటి సహాయకుడు పరారీలో ఉన్నాడు. అతని అన్వేషణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ టీమ్, క్రైమ్ టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. విచారణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని ఏడీజీపీ తెలిపారు.

హత్యానంతరం మృతదేహాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నం..

కేంద్ర హోంమంత్రి జమ్మూకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన తరుణంలో ఈ ఘటన జరగడం ఆశ్చర్యకరం. డీజీపీ దిల్‌బాగ్ సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐపీఎస్ అధికారి లోహియా మెడపై కత్తితో పొడిచినట్లు సమాచారం. అతని అనుమానాస్పద హత్య తర్వాత, అతని మృతదేహాన్ని కాల్చడానికి కూడా ప్రయత్నించారని తెలిపారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మూలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.