Delhi Arms haul: స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో మారణాయుధాల కలకలం.. నలుగురు అరెస్ట్.. పెద్ద ఎత్తున పిస్టల్స్ స్వాధీనం

|

Aug 13, 2021 | 6:35 PM

అక్రమ ఆయుధాలు తరలిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Delhi Arms haul: స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో మారణాయుధాల కలకలం.. నలుగురు అరెస్ట్.. పెద్ద ఎత్తున పిస్టల్స్ స్వాధీనం
Delhi Massive Arms Seized 1
Follow us on

Delhi Massive Arms seized: స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఢిల్లీలో మారణాయుధాలు తీవ్ర కలకలం సృష్టించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎర్రకోట వద్ద భారీ కంటైనర్లను కూడా అడ్డుగా పెట్టి కట్టుదిట్టమైన రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ శుక్రవారం భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది.

Delhi Massive Arms Seized

అయితే, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. విధ్వంసకర శక్తులు మాత్రం యధేచ్చగా తమ కార్యకలపాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే అక్రమ ఆయుధాలు తరలిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో భారీ విధ్వంసానికి తెర తీసినట్టు తెలుస్తోంది. అయితే వారి కుట్రను పోలీసులు ముందే పసిగట్టారు. నిఘావర్గాల హెచ్చరికలతో ముమ్మర తనిఖీలు చేశారు.

ఈ క్రమంలోనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఒక మొబైల్ ఫోన్, కొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులకు పట్టుబడింది స్థానిక వ్యక్తులే కావడం గమనార్హం. వీరిలో ఒకరిది ఢిల్లీ కాగా మరోకరిది ఉత్తరప్రదేశ్ గా గుర్తించారు.. ఈ క్రమంలోనే ఎర్రకోటతో పాటు ఢీల్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డ్రోన్లు,బెలూన్లు ఎగరవేయడం నిషేధించారు. అరెస్టయిన నిందితులలో ఒకరు కౌశల్ గ్యాంగ్‌కి సన్నిహితుడు అని, అతనిపై హర్యానా, ఢిల్లీలో రెండు హత్య కేసులలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు , భద్రతా సంస్థల సమన్వయంతో నగరం అంతటా అనేక కంపెనీల కమాండోలను మోహరించారు. అడుగడుగునా నాకాబందీ నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని అన్ని రోడ్లు, హైవేలు, ఇతర మార్గాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే వ్యక్తులందరినీ, వారి వాహనాలను తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి చిన్మోయ్ బిస్వాల్ తెలిపారు. సామాజిక వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు ఎవరూ రాజధాని నగరంలోకి ప్రవేశించరాదని ఆయన హెచ్చరించారు.

Read Also….. Justice Ayesha Malik: పాకిస్థాన్ చరిత్రలో తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా ఆయేషా మాలిక్.. నలుగురు సీనియర్లు కాదని..  

CM KCR: ప్రతి దళితుడికి ఆర్ఠిక సాయం అందాలి.. దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష