AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheating Gang: గిఫ్ట్‌కార్డుల పేరుతో ఫోన్‌కాల్ వస్తే నమ్మకండి.. భాగ్యనగర్‌వాసులకు సీపీ సజ్జనార్‌ ఇచ్చిన అలర్ట్..

Gift Calls Cheating: గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Cheating Gang: గిఫ్ట్‌కార్డుల పేరుతో ఫోన్‌కాల్ వస్తే నమ్మకండి.. భాగ్యనగర్‌వాసులకు సీపీ సజ్జనార్‌ ఇచ్చిన అలర్ట్..
cp sajjanar
Sanjay Kasula
|

Updated on: Mar 01, 2021 | 6:57 PM

Share

Cyberabad Police: డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఆశపడితే మోసపోతారు.. ! క్యా బాత్‌ హై. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అలర్ట్ చేస్తూ ఇచ్చిన మెసేజ్ ఇది. ఎస్.. మీ స్మార్ట్‌ ఫోన్‌కి మెసేజ్ వచ్చిందో, పోస్టల్ అడ్రస్‌కి గిఫ్ట్ కార్డు వచ్చిందనో ఆరాటపడితే.. ఉన్నది, ఉంచుకున్నదీ రెండూ పోతాయ్. అలా మాయ చేసే ఓ దగాకోరు ముఠానే అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.  గిఫ్ట్‌కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టకున్నారు.

ఫస్ట్ టైమ్‌ సైబరాబాద్‌ పోలీసులు 8మంది ముఠా చేస్తున్న ఓ సైబర్ నేరాన్ని బట్టబయలు చేశారు. వీళ్లంతా ముందుగా మీ పోస్టల్ అడ్రస్‌కి .. ఒక లెటర్‌, ఓ స్క్రాచ్‌ కార్డ్ పంపిస్తారు. అది స్క్రాచ్‌ చేసి చూస్తే.. మీరు XUV 500 గెలుచుకున్నారని ఉంటుంది. సహజంగానే ఆశ పుడుతుంది. HSBC స్టాంప్‌, నాప్‌టా‌ల్‌ కాన్ఫిడెన్షియల్ లెటర్‌ను చూసి మోసపోయి.. సదరు కాల్ ల్‌సెంటర్‌కి ఫోన్‌ చేశారా.. అంతే సంగతులు.

మనం ఏ భాషలో మాట్లాడినా అందుకు తగ్గ వక్తలు, వ్యక్తులు అక్కడ రెడీగా ఉంటారు. మాటల్లో పెట్టి మభ్యపెడతారు. పాతికలక్షల కారు.. కావాలంటే GST అనో, రిజిస్ట్రేషన్‌ అనో.. ఏదో చెప్పి మీ నుంచి పదివేలు, యాభై వేలు వసూలు చేస్తారు. మ్యాటర్ అంతా ఫేక్ అని తెలిశాక.. మీరు సదరు నెంబ్‌కే కాల్ చేసినా నో యూజ్‌. ఎందుకంటే అప్పటికే అది అవుట్ ఆఫ్ ఆర్డర్‌

గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎలాంటి దోపిడీ గ్యాంగ్‌లో సహజంగా బీహార్, జార్ఖండ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల వాళ్లనే ఇప్పటిదాకా మనం చూశాం. కానీ ఈ గ్యాంగ్‌లో మాత్రం తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. మనం న్యాప్‌టాల్ సహా ఈ కామర్స్‌ సైట్స్‌లో ఏదో పర్చేస్ చేసి ఉంటాం. అప్పుడు ఇచ్చిన అడ్రస్‌ను కలెక్ట్ ఈ ముఠా కలెక్ట్ చేసి.. ఇలా మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటికే 2కోట్లకు పైగా దోపిడీకి పాల్పడిన ఈ ముఠా గుట్టు బయటపెట్టిన సైబరాబాద్ పోలీసులు.. మిగతా పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని.. ఫాల్స్‌ SMSలకు, ఫేక్‌ ఈమెయిల్స్‌కు రెస్పాండ్ అవ్వొద్దని పదేపదే చెబుతున్నారు. నిందితుల నుంచి 42 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 900 స్క్రాచ్‌ కార్డులు, 28 డెబిట్‌ కార్డులు, 10 ఆధార్‌కార్డులు, రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

Actress Jayasudha: సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ ఎక్కడ, ఎంత ఉందంటే..