Crime News: ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 77 లక్షలు మాయం.. సిమ్ కార్డు యాక్టివ్ చేయాలంటూ…

|

Feb 21, 2021 | 8:25 PM

Crime News: సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. చిన్న లింక్ దొరికితే చాలు వారి ఖాతాలను..

Crime News: ఒక్క ఫోన్ కాల్‌తో రూ. 77 లక్షలు మాయం.. సిమ్ కార్డు యాక్టివ్ చేయాలంటూ...
Follow us on

Crime News: సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. చిన్న లింక్ దొరికితే చాలు వారి ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. అలా సైబర్ కేటుగాళ్ల బారినపడి ఓ అమాయకుడు ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో ఏకంగా రూ. 77 లక్షలను పోగొట్టుకున్నాడు. సిమ్ కార్డు బ్లాక్ అవుతుందంటూ మాయ మాటలు చెప్పి బ్యాంక్ వివరాలను తెలుసుకున్న నేరగాళ్లు… ఆ తర్వాత క్షణాల్లోనే బ్యాంక్‌లో ఉన్న సొమ్మంతా లూటీ చేశారు.

ఒడిశాలోని కటక్‌కు చెందిన శరత్ మెహంది అనే సీనియర్ డాక్టర్‌కు ఫిబ్రవరి 9వ తేదీన ఓ ఫోన్ కాల్ వచ్చింది. ”మీ సిమ్ కార్డు బ్లాక్ కాబోతోంది. వెంటనే దాన్ని రీ-యాక్టివ్ చేసుకోండి” అని అవతల వ్యక్తి పేర్కొన్నాడు. అందుకోసం ఈ నెంబర్‌కు లింక్ అయి ఉన్న వివరాలు చెబితే.. సిమ్ యాక్టివేట్ చేయిస్తామని” అని మాయమాటలు చెప్పాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు వారు చెప్పినట్లుగా చేశాడు. తన ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ కేటుగాళ్లు చెప్పిన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. దాని యాక్సిస్‌ను సైబర్ కేటుగాళ్లకు ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాల వివరాలన్నింటిని షేర్ చేశాడు. ఇంకేముంది జరగాల్సినదంతా జరిగిపోయింది. ఫిబ్రవరి 9-15 వరకు ఏకంగా రూ. 77,86,727ను సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. దీనితో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Also Read: Viral Video: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..