Gold seized at RGI Airport: దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతోంది. విదేశాల నుంచి వస్తున్న వారు అక్రమంగా.. బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. గురువారం పాస్తా తయారీ గ్రైండర్ మాటున పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈకే-526 విమానంలో స్వదేశానికి వస్తున్నాడు. ఈ క్రమంలో 2.8కిలోల బంగారాన్ని కరిగించి పాస్తా గ్రైండర్ ఆకారంలో తయారు చేసి లోపలి భాగంలో బిగించి తీసుకువస్తున్నాడు.
ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వస్తున్న క్రమంలో.. ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతను తీసుకువచ్చిన సామగ్రిని పరిశీలించగా అక్రమ బంగారం పట్టుబడింది. ఈ 2.8కిలోల బంగారం విలువ 1.36 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Also Read: