Gold Smuggling : సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారం దాచుకొని దేశాలు దాటారు, చివరికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో..

|

Apr 14, 2021 | 11:13 AM

Hyderabad airport Gold : బంగారం తరలింపులో ఎన్నో కొత్త కొత్త యత్నాలు, మరెన్నో మ్యాజిక్కులు.. ఇంకెన్నో జిమ్మిక్కులు. అయినాకాని కస్టమ్స్ అధికారులకు చిక్కేస్తున్నారు అక్రమ తరలింపు దారులు.

Gold Smuggling : సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారం దాచుకొని దేశాలు దాటారు, చివరికి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో..
Gold Smugling
Follow us on

Hyderabad airport Gold : బంగారం తరలింపులో ఎన్నో కొత్త కొత్త యత్నాలు, మరెన్నో మ్యాజిక్కులు.. ఇంకెన్నో జిమ్మిక్కులు. అయినాకాని కస్టమ్స్ అధికారులకు చిక్కేస్తున్నారు అక్రమ తరలింపు దారులు. తాజాగా ఒక వ్యక్తి వినూత్నంగా సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారాన్ని దాచుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పలేకపోయాడు. ఇవాళ 6 E – 25 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడ్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్ట్ లో తనిఖీ చేయగా సూట్ కేస్ ఫ్రేమ్ లో ఈ బంగారం బయటపడింది. దీంతో సదరు వ్యక్తిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. బంగారాన్ని అతని సూట్‌కేస్ యొక్క ప్రత్యేకంగా రూపొందించిన లోపలి ఫ్రేమ్ లో దాచారని పేర్కొన్నారు. ఇలా తీసుకొచ్చిన బంగారం విలువ 13.6 లక్షలుగా పేర్కొన్నారు. మొత్తంగా 381 గ్రాముల 18 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాగా, ఇటీవలే హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రయాణికుడు బంగారాన్ని తీసుకువస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి రూ.60 లక్షల విలువైన 1.2 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. అయితే ఈ బంగారం దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read also : బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డ్, వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ త‌న షేర్లను ఆవిష్కరిస్తున్న వేళ అద్భుతం