దారుణ ఘటన.. నాటు బాంబు పేలి ఏడేళ్ల బాలుడు మృతి.. నివేదిక కోరిన ఎన్నికల సంఘం

Crude bomb blast: నాటు బాంబు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ నగరంలోని సుభాష్‌పల్లి ప్రాంతంలో సోమవారం

దారుణ ఘటన.. నాటు బాంబు పేలి ఏడేళ్ల బాలుడు మృతి.. నివేదిక కోరిన ఎన్నికల సంఘం
crude bomb blast

Updated on: Mar 22, 2021 | 8:57 PM

Crude bomb blast: నాటు బాంబు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ నగరంలోని సుభాష్‌పల్లి ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. షేక్ అఫ్రోజ్(7), షేక్ ఇబ్రహీం అనే ఇద్దరు చిన్నారులు తమ ఇంటి వద్ద ఆడుకుంటుండగా బాంబు పేలినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తమ ఇంటి వద్ద ఉన్న ఓ పొట్లాన్ని వారు తాకగా.. అందులో ఉన్న నాటు బాంబు పేలి వారికి తీవ్ర గాయాలయినట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు.. గాయపడ్డ చిన్నారులిద్దరినీ హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే అఫ్రోజ్ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఇబ్రహీంకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపుతోంది.

ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. 24గంటల్లో నివేదకను అందించాలంటూ ఈసీఐ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా ఇటీవల కాలంలో బెంగాల్‌లో నాటు బాంబులు వరుసగా పేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదిపత్య పోరుతో పలుపార్టీల కార్యకర్తలు ఇలాంటి దాడులకు దిగుతున్నారు.

Also Read:

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై బాదుడు.. గత ఆరేళ్లల్లో ఎంతశాతం పన్నులు పెరిగాయో తెలుసా..?

యూత్ కి కిక్కెక్కించే వార్త ! ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ కొత్త లిక్కర్ పాలసీ