ప్రజా పోరాటాల ఫలితంగానే వెన్నులో వణుకుపుట్టి సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. ఈ నెల 9న హత్యాచార ఘటన బయటపడినప్పటి నుంచి నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్‌కు సమీపంలో రాజు రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు. ఘట్‌కేసర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి చేతిపై ‘మౌనిక’ అని రాసున్న పచ్చబొట్ట ఆధారంగా మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్థారించారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సీతక్క.. ఇది ప్రజల విజయమని అభివర్ణించారు. గత వారం రోజులుగా చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలని, రాజును కఠినంగా శిక్షించాలని పోరాటాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే నిందితుడు రాజును పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ప్రజల పోరాటాల ఫలితంగానే వెన్నులో వణుకుపుట్టి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. భవిష్యత్తులో ఎవరైన ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ఇదే గతి పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించినా.. స్పందించకపోయినా ప్రజా పోరాటాల కారణంగా ఇలా చావాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. అదే సమయంలో రాజు తప్పులతో సంబంధంలేని అతని బిడ్డను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీతక్క పేర్కొన్నారు.
ఈ నెల 9న సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారి చైత్ర హత్యాచారానికి గురైన ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చిన్నారిని చిదిమేసిన నిందితుడు రాజు.. నాటి నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం దాదాపు 1000 మంది పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుడు రాజుకి సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షల నగదు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహం లభ్యమయ్యింది. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు.
Also Read..