A Man Attack With Ax: ఖమ్మం జిల్లాలో దారుణం.. రూ.70 కోసం గొడవ.. గొడ్డలితో దాడి..

|

Oct 01, 2021 | 9:04 PM

ఈ రోజుల్లో చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలు కూడా చేస్తున్నారు. రూపాయి కోసం హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయి..

A Man Attack With Ax: ఖమ్మం జిల్లాలో దారుణం.. రూ.70 కోసం గొడవ.. గొడ్డలితో దాడి..
Crime News
Follow us on

ఈ రోజుల్లో చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హత్యలు కూడా చేస్తున్నారు. రూపాయి కోసం హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయి. తాజాగా రూ.70 కోసం గొడ్డలితో దాడి చేసుకున్నారు. అవును.. కేవలం రూ.70 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం ఏర్పడి చివరకు గొడ్డలితో దాడి చేసుకునేంత వరకు దారి తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా ధంసలాపురంలోని కొత్తకాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ కొమ్ము ఉప్పలయ్య సమీప బంధువైన కొమ్ము కోటయ్యకు రూ.70 ఎప్పుడో ఇచ్చాడు.

ఈ మధ్య ఉప్పలయ్య, కోటయ్యను కలిశారు. యోగక్షేమాలు ఒకరికొకరు అడిగి తెలుసుకున్నారు. ఇంతలో ఉప్పలయ్యకు కోటయ్యకు రూ.70 ఇచ్చిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే ఉప్పలయ్య.. కోటయ్యను రూ.70 ఇవ్వాలని అడిగారు. ఎక్కకడివి రూ.70 అంటూ కోటయ్య లైట్ తీసుకున్నారు. ఇదే విషయమై బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 70 రూపాయల కోసం గొడవ ఏమిటి అని స్థానికులు సర్దిచెప్పి  ఇంటికి పంపించారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన కోటయ్య కోపంగా ఉన్నాడు. అతడి కుమారుడు ఏమైంది నాన్న అని అడిగాడు. కోటయ్య జరిగిన విషయమంతా కొడకు అశోక్‎కు చెప్పాడు. అశోక్ గొడ్డలి తీసుకెళ్లి ఉప్పలయ్యపై దాడి చేశాడు. దాడిలో ఉప్పలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Read Also..  Viral Video: పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‎లో మంటలు.. వైరలైన వీడియో