AP Skill Scam: షెల్‌ కంపెనీల పేరుతో గోల్‌మాల్‌.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు

|

Dec 12, 2021 | 5:44 PM

AP CID Probe: ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. సోదాలతో స్పీడ్‌ పెంచిన సీఐడీ అరెస్టులతో దూకుడు పెంచింది.

AP Skill Scam: షెల్‌ కంపెనీల పేరుతో గోల్‌మాల్‌.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో వెలుగులోకి సంచలనాలు
Ap Skill Development Corporation Scam
Follow us on

AP Skill Development Corporation Scam: ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. సోదాలతో స్పీడ్‌ పెంచిన సీఐడీ అరెస్టులతో దూకుడు పెంచింది. వందల కోట్ల రూపాయల స్కామ్‌ చేసిందెవరు? వాళ్ల వెనుక ఉన్నదెవరు? ఇదే ఇప్పుడు మెయిన్‌ పాయింట్‌గా మారింది. దీంతో, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అసలు సూత్రధారులెవరో? ఎవరెవరు ఎంతంత నొక్కేశారో తేల్చే పనిలో పడింది సీఐడీ. మొత్తం 26మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సీఐడీ ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకుంది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్ పేరుతో పెద్దఎత్తున అవినీతి జరిగిందనేది అభియోగం. షెల్‌ కంపెనీల పేరుతో 241కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కేసు లింకులు అనేకచోట్ల ఉండటంతో కీలక ఆధారాలు సేకరిస్తోంది. ఏకకాలంతో ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్‌, విజయవాడతోపాటు పలు నగరాల్లో మొత్తం 8 టీమ్స్ దర్యాప్తు చేపట్టాయి.

A6 సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, A8 డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్, A10 సిల్వర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముకుల్‌ అగర్వాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆరోగ్య కారణాలతో ముకుల్‌ అగర్వాల్‌ను మచిలీపట్నం జైలుకు తరలించగా, మిగతా ఇద్దరు నిందితులను విజయవాడ జైలుకు షిఫ్ట్ చేశారు. ముకుల్‌ అగర్వాల్‌ కోవిడ్ రిపోర్ట్‌ రాగానే అతడిని కూడా విజయవాడ జైలుకు తరలించనున్నారు. అయితే, A1 మాజీ స్పెషల్ సెక్రటరీ ఘంటా సుబ్బారావును అదుపులోకి తీసుకున్న సీఐడీ… ఆయనను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. ఈ స్కామ్‌లో A2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈయన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా పనిచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. దాంతో, ఈ కేసులో అత్యంత కీలకంగా మారారు లక్ష్మీనారాయణ.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ ఫిర్యాదుతో ఈ స్కామ్‌ తెరపైకి వచ్చింది. ఇందులో గత ప్రభుత్వ పెద్ద తలకాయల పాత్ర ఉందనేది ఆరోపణ. అందుకే, ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుంది సర్కార్.

Read Also….  Viral video: ప్రభాస్‌ పాటకు టాంజానియా అన్నాచెల్లెళ్ల లిప్‌ సింక్‌.. కత్రినా పాటకు కూడా.. వైరల్‌గా మారిన వీడియోలు..