Nizamabad: లక్కీ డ్రాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కారు.. ఆశపడ్డారో ఖేల్ ఖతం.. భారీ మోసం

|

Jul 17, 2021 | 7:25 AM

లక్కీ డ్రా పేరుతో నిజామాబాద్‌ జిల్లా ప్రజలను మోసం చేశారు కొందరు కేటుగాళ్లు. లక్కీ డ్రాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కార్లు, బైకులు, బంగారం...

Nizamabad: లక్కీ డ్రాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కారు.. ఆశపడ్డారో ఖేల్ ఖతం.. భారీ మోసం
Lucky Draw Cheating
Follow us on

లక్కీ డ్రా పేరుతో నిజామాబాద్‌ జిల్లా ప్రజలను మోసం చేశారు కొందరు కేటుగాళ్లు. లక్కీ డ్రాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కార్లు, బైకులు, బంగారం ఇస్తామని ఆశ చూపించారు. ఇది నమ్మిన జిల్లా వాసులు లక్కీ డ్రా కోసం డబ్బులు కట్టారు. చివరి వరకు అమాయకులను ఆశల పల్లకిలో ఊరేగించిన కేటుగాళ్లు 8 కోట్లతో ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో షైన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఈ షాప్‌ తెరిచి అమాయకులకు గాలం వేశారు కేటుగాళ్లు. అతి తక్కువ డబ్బులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మీ సొంతం చేసుకోవచ్చని మిడిల్‌ క్లాస్‌ ప్రజలను మోసం చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కార్లు, బైక్‌లను లక్కీడ్రాలో గెలుచుకోవచ్చని ఆశపడిన అమాయకులకు కుచ్చుటోపీ పెట్టారు నిందితులు. 8 కోట్ల రూపాయలు వసూలు కాగానే ఉడాయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో షైన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నిర్వాహకులు మహ్మద్‌ అబ్దుల్‌ ఫిరోజ్‌, మహ్మద్‌ మసూర్‌, మహ్మద్‌ అబ్దుల్‌, సయ్యద్‌ సోహైల్‌ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దాదాపు 4 వేల మంది దగ్గరి నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. చైన్‌ సిస్టమ్‌ మాదిరిగా ఈ స్కీమ్‌ ద్వారా మోసానికి తెర తీశారని పోలీసులు తెలిపారు. మనీ సర్క్యూలేషన్‌, తెలంగాణ లాటరీ 1968 చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో ఇలాంటి స్కీమ్‌లు ఇంకా ఎన్ని ఉన్నాయో ఆరా తీసి, వాటిపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు పోలీసులు. ప్రజలు ఇలాంటి లక్కీడ్రాల మోజులో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.

Also Read: హైదరాబాద్ పాతబస్తీలో ముస్తాక్ అనే రౌడీ షీటర్ హత్య

ఒక్క సెకనులో 57 వేల సినిమాలు డౌన్‌లోడ్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్‌.