Crime News: ఐటీ అధికారినంటూ ఘరానా మోసం.. నగలతో ఉడాయించిన వైనం

|

Nov 05, 2021 | 1:42 PM

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఐటీ అధికారినంటూ ఆభరణాల షాపు యజమానికి టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు...

Crime News: ఐటీ అధికారినంటూ ఘరానా మోసం.. నగలతో ఉడాయించిన వైనం
Follow us on

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఐటీ అధికారినంటూ ఆభరణాల షాపు యజమానికి టోకరా వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆన్‌లైన్‌లో మనీ పంపించానంటూ నగలతో సహా ఉడాయించాడు. తీరా మోసపోయానని తెలుసుకున్న నగల షాపు యజమాని పోలీసులను ఆశ్రయించాడు‌. కేసు నమోదు చేసి‌న పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. బాధితుల వివరాల మేరకు ఈనెల 1న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ లో గల డీబీ జ్యూవెలరీ దుకాణంలో ఈ ఘరానా మోసం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కారులో వచ్చిన నిరంజన్ అనే వ్యక్తి ఐటీ అధికారిగా దుకాణ యజమానకి తనను పరిచయం చేసుకున్నాడు. అనంతరం షాపులో సోదాలు చేశాడు. ఆ తర్వాత డబ్బులు ఆన్‌లైన్‌లో పంపించానంటూ కొన్ని నగలు తీసుకుని ఉడాయించాడని బాధితుడు వాపోయాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సరిహద్దు మహరాష్ట్రల్లోనూ ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

Crime News: పండగపూట దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపిన దుండగులు.. ఒకరు మృతి..

Crime News: బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం.. సిబ్బందితో కలిసి ఏటీఎంలోని రూ.10 లక్షల చోరీ..

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..