Central Crime Branch Bengaluru: కర్ణాటకలో రాత్రివేళ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన పోలీసులు రెండు వాహనాలను ఆపి పరిశీలించారు. ఇద్దరు రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న ఆ కార్లల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని మార్తహల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు కార్లల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు రౌడీ షీటర్లు పట్టుబడ్డారు.
అనుమానం వచ్చిన పోలీసులు ఆ రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న రెండు కార్లను పరిశీలించగా.. 18 వేట కత్తులు లభ్యమయ్యాయి. ఆ రౌడీషీటర్లతోపాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ కత్తులను ఎక్కడికి.. ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఈ విషయంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు రౌడీషీటర్లు ప్రయాణిస్తున్న కార్లల్లో ఇంత పెద్ద ఎత్తున వేట కత్తులు లభ్యమవడం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Karnataka: Central Crime Branch, Bengaluru has arrested 11 persons including two rowdy sheeters, 18 sharp weapons and 2 cars seized pic.twitter.com/Cpm3VsfU9m
— ANI (@ANI) February 24, 2021
Also Read: