Case File On Chandrababu: టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై శనివారం కేసునమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురు మూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారు.
దీంతో టీడీసీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు కట్టాలని వైసీపీ నేతలు ఏపీ డీజీపీని శుక్రవారం కోరారు. చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు, లోకేష్‌లపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఐటీ యాక్ట్ కింద శనివారం కేసు నమోదు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్.. డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేయగా. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు బాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు.
పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు, వీళ్ల ఉద్యోగాలు గోవిందా.. గోవింద! అంటూ ఎద్దేవా
Huge Money Siezed: ఆ బ్యాగ్ నిండా నోట్ల కట్టలే.. అది చూసి షాక్ అయిన అధికారులు.. ఇంతకీ ఎక్కడంటే..
తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.1,000 ఫైన్.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్