Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..

AP Crime News: దీపావళి సందర్భంగా అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నిప్పురవ్వలు ఎగిరిపడి పలు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. అయితే.. బాణాసంచా కాలుస్తుండగా

Diwali 2021: బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం.. నిప్పురవ్వలు పడి అగ్నికి ఆహుతైన కారు..
Car Fire

Updated on: Nov 05, 2021 | 12:41 PM

AP Crime News: దీపావళి సందర్భంగా అనేక చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నిప్పురవ్వలు ఎగిరిపడి పలు ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. అయితే.. బాణాసంచా కాలుస్తుండగా నిప్పు రవ్వలు ఎగిరిపడి కారు దగ్ధమైన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణంలోని గాంధీనగర్‌లో పార్కు చేసిన కారుపై నిప్పురవ్వలు పడటంతో అగ్నికి ఆహుతైంది. వీధిలో టపాసులు కాలుస్తుండగా.. నిప్పురవ్వలు కారుపై కప్పిన పరదాపై పడ్డాయి. దీంతో పరదాకు అంటుకున్న మంటలు ట్యాంకుకు వ్యాపించాయి. దీంతో మంటలు ఎగిసిపడి కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే కారు ముందు భాగం అంతా తీవ్రంగా కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కారు ఇంజన్‌ మొత్తం పూర్తిగా దగ్దమైందని తెలిపారు.

కాగా.. దీపావళి సందర్భంగా చాలా చోట్ల ప్రమాదాలు సంభవించాయి. చాలామంది బాధితులు కంటి సమస్యలతో ఆసుపత్రులకు పయనమవుతున్నారు. గత రాత్రి నుంచే హైదరాబాద్ సరోజిని కంటి ఆసుపత్రిలో 30కి పైగా కేసులు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.

Also Read:

Crime News: సీఐడీ సీరియల్ చూసి దారుణానికి పాల్పడిన మైనర్లు.. ఓ వృద్ధురాలిని అత్యంత పాశవికంగా..

LPG Gas Cylinder: పెట్రో ధరలు తగ్గించినట్లే.. గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిస్తేనే సామాన్యులకు ఊరట