రహదారి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భూపాలపల్లి జిల్లా బుధవారపేటలో ప్రమాదం జరిగింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వాహనదారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. అధికారులు-కాంట్రాక్టర్ అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు స్ధానికులు. బుధరావుపేట – మంగళవారి పేట మధ్య జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద నిన్న రాత్రి బైక్‌తో సహా అందులోపడి సాయిరాం అనేవ్యక్తి మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. అయితే తాజాగా రాత్రి మరోప్రమాదం చోటు చేసుకుంది. ఈసారి కారు అదుపుతప్పి బ్రిడ్జి పై నుండి పడడంతో హన్మకొండకు చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. రాత్రి 7గంటల సమయంలో వెళ్తుండగా రాత్రి బుధరావుపేట శివారులోకి రాగానే నిర్మాణంలో ఉన్న కల్వర్టు వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోడంతో దానిని ఢీకొని పక్కనే ఉన్న నీటిగుంతలో పడిపోయారు.
గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బ్రిడ్జి నిర్మిస్తున్న ప్రదేశంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు లేక పోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు . ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా…ప్రాణాలు పోతున్నా చీమకుట్టినట్టు కూడా లేదంటున్నారు.