Telangana Crime News: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు

|

Jun 20, 2021 | 12:13 PM

అశ్వారావుపేటలో రాష్ట్రీయ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టిబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తెలంగాణ రాష్ట్ర బోర్డర్...

Telangana Crime News: పైకి మామ‌డి పండ్ల లోడే.. లోప‌ల చెక్ చేసి ఖంగుతిన్న పోలీసులు
Cannabis Seized
Follow us on

అశ్వారావుపేటలో రాష్ట్రీయ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టిబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తెలంగాణ రాష్ట్ర బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద స్థానిక ఎస్సై రామ్మూర్తి ఆధ్వర్యంలో విస్తృత తనీఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆరున్నర కిలోల నిషేధిత గంజాయిని సీజ్‌ చేశారు. మామిడికాయల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని అనుమానం వచ్చి తనిఖీ చేయగా, అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. డ్రైవర్‌తో సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో షాకింగ్‌ విషాయలు తేల్చారు పోలీసులు. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారుగా గుర్తించారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన మరో వ్యక్తితో కలిసి విశాఖపట్నంలోని చింతపల్లిలో 6.50 క్వింటాల గంజాయిని కొనుగోలు చేసి, యూపీకి తరలిస్తున్నట్లు విచారణలో తేల్చారు. స్వాధీనం చేసుకున్న 130 గంజాయి ప్యాకెట్లు దాదాపు 686 కేజీలు ఉన్నాయని, వాటి విలువ సుమారు కోటి 20 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు తెలిపారు.

మ‌రోవైపు  ఒడిశా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న రూ.21 లక్షల విలువైన గుట్కా, పాన్‌ మసాలా, గంజాయిని ఇచ్ఛాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాశీబుగ్గ డిఎస్‌పి శివరామిరెడ్డి మాట్లాడారు. భారీగా గుట్కా, పాన్‌ మసాలా తరలిస్తున్నట్లు సిఐ వినోద్‌బాబుకు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది జాతీయ రహదారి వద్ద పాత టోల్‌ ప్లాజ్‌ వద్ద మాటు వేశారని తెలిపారు. పథకం ప్రకారం కంటైనరును పట్టుకుని తనిఖీ చేశామన్నారు. అందులో 87 బస్తాల్లో రూ.20.35 లక్షల విలువైన గుట్కా, పాన్‌ మసాలా ప్యాకెట్లు ఉన్నాయని వివ‌రించారు . దీనితోపాటు రూ.90 వేలు విలువైన 45 కేజీల గంజాయిని సీజ్‌ చేసినట్లు డిఎప్‌పి వెల్ల‌డించారు.

Also Read: ఏటీఎంలో చోరి కేసులో దొరికారు.. విచార‌ణ‌లో పోలీసుల మైండ్ బ్లాంక్

ఏపీ పోలీసుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్న ట్విట్టర్.. నోటీసులు పంపేందుకు ప్లాన్ చేస్తున్న అధికారులు