AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెన్నులో బుల్లెట్..మిస్టరీలో నయా ట్విస్ట్..!

పాతబస్తీ లేడీ ఆస్మా బాడీలో బుల్లెట్‌ మిస్టరీ కేసును పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఆమె బాడీలోకి బుల్లెట్ ఎలా వచ్చింది..? తనకేం తెలియదంటున్న యువతి మాటల్లో నిజం ఎంత..? ఆమె పేరెంట్స్ నిజాన్ని ఎందుకు దాస్తున్నారు..? ఆమెపై ఎవరైనా కాల్పులు జరిపారా..?  అన్న కోణంలో ఖాకీల విచారణ సాగుతోంది. అయితే ఆస్మాను తండ్రే నాటు తుపాకీతో కాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుర్వేదం, నాటు వైద్యంతో బ్లీడింగ్, నొప్పి కలగకుండా యువతి జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఆస్మా […]

వెన్నులో బుల్లెట్..మిస్టరీలో నయా ట్విస్ట్..!
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2019 | 12:24 PM

Share

పాతబస్తీ లేడీ ఆస్మా బాడీలో బుల్లెట్‌ మిస్టరీ కేసును పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఆమె బాడీలోకి బుల్లెట్ ఎలా వచ్చింది..? తనకేం తెలియదంటున్న యువతి మాటల్లో నిజం ఎంత..? ఆమె పేరెంట్స్ నిజాన్ని ఎందుకు దాస్తున్నారు..? ఆమెపై ఎవరైనా కాల్పులు జరిపారా..?  అన్న కోణంలో ఖాకీల విచారణ సాగుతోంది.

అయితే ఆస్మాను తండ్రే నాటు తుపాకీతో కాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుర్వేదం, నాటు వైద్యంతో బ్లీడింగ్, నొప్పి కలగకుండా యువతి జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఆస్మా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. కాగా ఈ రోజు సాయంత్రానికి ఇన్సిడెంట్ సంబంధించిన పూర్తి డిటేల్స్‌ను ఖాకీలు సేకరించే అవకాశం కనిపిస్తోంది.

మరో వెర్షన్‌పై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.  అస్మా ఫాదర్ నజీర్ కింగ్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో కాపలదారుడిగా పనిచేసేవాడు. అప్పుడు తరచూ అస్మా కూడా అక్కడకు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో అక్కడే  ఓ పెళ్లి వేడుకలో ఆ ఫంక్షన్‌ హాల్‌ ఓనర్ కొడుకు జుబేర్‌ కాల్పులు జరిపాడు. ఈ ఇష్యూపై గతంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా ఫైల్ అయ్యింది. ఆ సమయంలో అస్మాకు ఏమైనా గాయమైందా అనే కోణంలో కూడా ఖాకీలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

వెన్ను నొప్పితో వచ్చిన నిమ్స్ హాస్పటల్‌కు వచ్చిన ఆస్మాకు, డాక్టర్లు స్కాన్ చెయ్యగా లోపల ఏదో నల్లటి పదార్థం ఏదో ఉందని తేలింది. వెంటనే ఆపరేషన్ చేయగా..బుల్లెట్ బయటపడటం సంచలనంగా మారింది. మెడికో లీగల్ కేసు కావడంతో..డాక్టర్లు పోలీసులను అప్రోచ్ అయ్యారు. బుల్లెట్‌ శరీరంలోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని.. ఆపరేషన్‌ చేసిన తర్వాత కూడా తమకు చెప్పలేదని డాక్టర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.