Brutal murder on CCTV : గుంటూరు కెవిపి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. గోపి అనే వ్యక్తి ని కర్రలతో కొట్టి చంపారు కొందరు యువకులు. గెలాక్సీ బార్ లో మద్యం తాగుతుండగా చెల రేగిన వివాదం చివరికి మర్డర్ కు దారితీసినట్టు తెలుస్తోంది. గుంపుగా యువకులంతా కర్రలతో దాడి చేయడంతో గోపి అనే వ్యక్తి మద్యం షాపులో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మర్డర్ సీన్ మొత్తం రికార్డ్ అయింది.
Read also : YS Sharmila : మైనారిటీలతో లోటస్ పాండ్ లో షర్మిల సమ్మేళనం, తెలంగాణలో ముస్లింల పరిస్థితి ఇలా ఉందంటూ వ్యాఖ్యలు