Boduppal Scame: బోడుప్పల్‌లో ఘరానా మోసం.. దీపం వత్తుల మెషీన్‌ పేరుతో రూ.20 కోట్ల టోకరా..!

|

Jul 08, 2022 | 9:24 PM

Boduppal Scame: యూట్యూబ్ చానల్లో వీడియోలు పెడుతూ దీపం వత్తుల పేరుతో సామాన్య ప్రజల వద్ద ఒక్కక్కరి నుండి 1,77,000 వసూలు చేసి సుమారు 20 కోట్ల రూపాయలు..

Boduppal Scame: బోడుప్పల్‌లో ఘరానా మోసం.. దీపం వత్తుల మెషీన్‌ పేరుతో రూ.20 కోట్ల టోకరా..!
Follow us on

Boduppal Scame: యూట్యూబ్ చానల్లో వీడియోలు పెడుతూ దీపం వత్తుల పేరుతో సామాన్య ప్రజల వద్ద ఒక్కక్కరి నుండి 1,77,000 వసూలు చేసి సుమారు 20 కోట్ల రూపాయలు మోసం చేసిన ఘటన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వత్తుల పేరుతో 800 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదులా పేరుతో గత సంవత్సరం క్రితం బాల స్వామి గౌడ్ ఫ్లోర్ క్లినింగ్ మెటీరియల్, శానిటైజర్, సర్ఫ్ ఇలా పలు బిసినెస్ లు ప్రారంభించి దాంట్లోనే ఈ వత్తుల మిషన్లు అమ్మేవాడు.1,77,000 చెల్లిస్తే మిషన్ ఇస్తానని మొదటగా 1,20,000 కట్టి మిగతా 57,000 రూపాయలను ఐదు ఇన్స్టాల్ మెంట్లు 9,500 చొప్పున కట్టించుకున్నాడు. అతని దగ్గరే ఒక కిలో కాటన్ కు 300 చొప్పున అమ్మి ఆ మెషీన్ సాయంతో వత్తులు చేసి ఇస్తే కిలో 600 లకి బై బాక్ స్కీంతో కొనుగోలు చేసేవాడు. చివరకు దళిత బంధు స్కీం ద్వారా వచ్చిన బాధితుల డబ్బును కూడా దోచుకున్నాడు బాలస్వామి దళిత బంధులో వచ్చిన నాలుగు లక్షలకి మరో నాలుగు లక్షలు బ్యాంకులో అప్పు తీసుకుని ఎనిమిది లక్షలు ఇతనికి ఇచ్చామని ఇప్పుడు మునిగిపోయామని ఖమ్మం నుంచి వచ్చిన రమేష్ అనే బాధితుడు వాపోయాడు

కానీ గత కొంత కాలంగా ఈ డబ్బులు ఇవ్వకుండా కాటన్ సరిగా సప్లై చేయకపోవడంతో బాధితులు గత నెలలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసుల సమక్షంలోనే అందరి డబ్బులు తిరిగి చెల్లించేస్తానంటూ మాటి ఇవ్వటంతో కేసు ఫైల్ అవ్వకుండానే బయట పరిష్కరించుకున్నారు. బాల స్వామి ఎవరి డబ్బులు వారికి అందిస్తాను నా వద్ద వత్తులు స్టాక్ అలానే ఉంది.. దాన్ని అమ్మి ఎవరి డబ్బులు వారికి ఇస్తాను అన్నాడు. దానికి గాను జులై 8 న రమ్మనడంతో 800 మంది బాధితులు బోడుప్పల్ లోని బాలస్వామి కార్యాలయానికి చేరుకున్నారు. కానీ ఇక్కడ ఎవరు లేకపోవడంతో వారు ఆందోళకు దిగారు. పోలీసులు మళ్ళీ రంగ ప్రవేశం చేసి వారి వద్ద ఉన్న బాండ్‌లను హ్యాండోవర్ చేసుకున్నారు. తరువాత ఏసీపీ శ్యాం ప్రసాద్ వచ్చి వారికి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు 20 కోట్లు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు సుమారు 800 మందిని బాలస్వామి గౌడ్ మోసం చేశాడని అంటున్నారు. నెలకు కనీసం 50 వేల రూపాయలు సంపాదించుకోవచ్చని, అందుకు ముందుగా వత్తులు తయారు చేసే మిషన్ కొనుక్కోవాలని రూ.20,000 కూడా ఉండని మిషన్ లక్షన్నర, రెండు లక్షల కి అమ్మి మోసం చేశాడు. ఆర్థికంగా కాస్త నిలదొక్కు కుంటామని ఆశపడి.. ఇల్లు, బంగారం తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని, ఇంట్లో మగ వాళ్లకు తెలియకుండా దాచుకున్న డబ్బులు అంతా కట్టి మోసపోయావని చాలామంది మహిళలు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి