Blackmail: న్యూడ్‌ కాల్స్‌తో బ్లాక్‌ మెయిల్‌… పెరుగుతున్న కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

|

Nov 06, 2021 | 6:04 AM

Blackmail: కాబోయే భర్తో, లేక ప్రేమించిన యువకుడి కోరిక మేరకో న్యూడ్‌ కాల్స్‌ చేసి యువతులు ఇరుక్కుంటున్నారు. తరువాత వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌..

Blackmail: న్యూడ్‌ కాల్స్‌తో బ్లాక్‌ మెయిల్‌... పెరుగుతున్న కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
Follow us on

Blackmail: కాబోయే భర్తో, లేక ప్రేమించిన యువకుడి కోరిక మేరకో న్యూడ్‌ కాల్స్‌ చేసి యువతులు ఇరుక్కుంటున్నారు. తరువాత వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేయడం, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి పరువు, ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పెళ్లి చేసుకోబోయే యువతినే బ్లాక్ చేసి ఆమె చావుకు కారణం అయ్యాడో యువకుడు. కాబోయే భర్తే కదా అని నమ్మినందుకు నట్టేట ముంచాడు. చివరకు యువతిని, ఆమె కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామానికి చెందిన కార్తిక్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కార్తిక్ కు ఇటీవల పెండ్యాల గ్రామానికి చెందిన యువతితో వివాహం కుదిరింది. కాబోయే భర్తతో రోజూ ఫోన్ లో మాట్లాడే క్రమంలో న్యూడ్‌గా తనతో మాట్లాడాలని బలవంతం పెట్టాడు కార్తిక్‌. అతని కోరికతో కాబోయే భర్తే కదా.. అని న్యూడ్‌గా వీడియో కాల్స్ చేసింది యువతి. ఆ న్యూడ్‌ కాల్స్‌ను ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసిన కార్తిక్‌.. ఇటీవలే ఇండియాకు వచ్చిన కార్తిక్ యువతికి తెలియకుండా సన్నిహితంగా ఉంటూ కొన్ని ఫోటోలను తీశాడు.

ఫోటోలను, న్యూడ్ వీడియోలను అడ్డు పెట్టుకుని భారీగా కట్నం కావాలిని డిమాండ్ చేశాడు. అడిగినంత కట్నం ఇవ్వకుంటే ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. కట్నం ఇవ్వలేకపోవడంతో ఇరు కుటుంబాలు వివాహం రద్దు చేసుకున్నాయి. దీంతో అవమానంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చివరికి యవతి మరణానికి కారణమైన కార్తిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటీవలి కాలంలో న్యూడ్‌ కాల్స్‌ తో బ్లాక్‌ మెయిల్‌ చేసిన సంఘటనలు, కేసులు..
2021, అక్టోబర్‌ 18.. సోషల్‌ మీడియాలో పరిచయాలు, న్యూడ్‌ ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ను గత నెలలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నట్లు తేల్చిన పోలీసులు. ప్రసన్న కుమార్ మొబైల్ చెక్ చేయగా పదులకొద్దీ అమ్మాయిలు, మహిళల న్యూడ్ వీడియోలు గుర్తించారు పోలీసులు. ఇతనిపై ఇప్పటివరకూ 26 కేసులు నమోదయ్యాయి.

కేడీ లేడీలు కూడా చాలా ఉన్నారు…
2021, అగస్టు 5 హైదరాబాద్‌, మైలార్‌దేవులపల్లి పరిధిలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థి సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసిన పరిచయం పెంచుకున్న ఓ యువతి.. నువ్వంటే నాకు ఇష్టం అంటూ మాయ మాటలు చెప్పి, నువ్వు నగ్నంగా ఉన్న ఫోటో లేదా వీడియో పంపించాలని కోరగా, ఆ యువతి మాటలు నమ్మిన విద్యార్థి ఆమె కోరినట్టుగానే నగ్నంగా తయారై వీడియో కాల్‌ చేశాడు. మరుసటి రోజు నుంచీ ఆ యువతి స్థానంలో మరో వ్యక్తి మాట్లాడుతూ.. మా అమ్మాయికి నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు పంపిస్తావా అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. మీ ఇంటికి వచ్చి నీపై, మీ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తూ విద్యార్థిని నుంచీ 20 వేలు వసూలు చేశారు. తరువాత విషయం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో వాళ్లు మైలార్‌దేవులపల్లి పోలీసులకు ఆశ్రయించారు

2021 జూన్‌ 26న..
పాతబస్తీకి చెందిన అబ్దుల్ ఖరీం అనే వ్యక్తికి సోషల్ మీడియాలో యువతి పేరిట ప్రెండ్ రిక్వెస్ట్ పపరిచయం పెంచుకున్న యువతి న్యూడ్ గా వీడియో కాల్ చేసి అతడిని కూడా న్యూడ్ గా మాట్లాడేలా ముగ్గులోకి దింపింది. న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి లక్షలు వసూలు చేసింది. తట్టుకోలేక ఆ యువకుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

2021, మార్చి 7న..
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకున్న మహిళ.. న్యూడ్‌గా వీడియో కాల్ చేయమని రెచ్చగొట్టి వాటిని రికార్డ్ చేసి, న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులు పాల్పడింది. 22వేలు సమర్పించుకున్నప్పటికీ, మరో లక్ష కావాలంటూ డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించిన యువకుడు.

జాగ్రత్తగా ఉండాలి..
ఇలాంటి వాటిపై పోలీసులు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. మీ భాగస్వామికి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంటే ముందే గుర్తించవచ్చు. తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఓసారి గమనించండి. తన స్నేహితులు, పోస్ట్‌లు, ఎలా ఉన్నాయో పరిశీలించండి. వీటన్నింటి ఆధారంగా ఓ అంచనాకు రావచ్చు. మీరు ఎంత దగ్గరైనా న్యూడ్‌ ఫోటోలు పంపించమంటున్నాడంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈమధ్య కాలంలో ఇలాంటి మోసాలు పెరిగిపోయాయని, అపరిచితులు చేసే ఫోన్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. అయిన జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి.. అమాయకులను టార్గెట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఇలాంటి కాల్స్ పై అలెర్ట్‌గా ఉండాలని జూలైలో ఒక సైబర్ క్రైం అవగాహన సదస్సులో సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

Aryan Khan Drugs Case: మళ్లీ ఎన్సీబీ కార్యాలయానికి కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌.. ఎందుకో తెలుసా..?

Villupuram Blast Video: తమిళనాడులో దారుణం.. నాటు బాంబులు పేలి తండ్రి కొడుకు దుర్మరణం