కరోనా కల్లోలం ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం. ఈ స్థాయి మహమ్మారి వైరస్ కోసం వ్యాక్సిన్ తయారుచేశాం. కానీ ప్రజల నుంచి మూఢనమ్మకాలను దూరం చేయలేకపోతున్నాం. తాజాగా కర్నూలు జిల్లాలో నడిరోడ్డుపై క్షుద్రపూజలు కలకలం రేపాయి. కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, చిల్లర నాణేలు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు భయానక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కానీ, ఓ యువకుడు మాత్రం డేరింగ్ స్టెప్ వేశాడు. అతడు చేసిన పనితో అంతా షాక్ అయ్యారు. ఇదేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.
మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ ప్రచారం చేస్తున్నాడు కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన నాగన్న. రామతీర్థంకు వెళ్లే దారిలో కొందరు పసుపు, కుంకుమ, పువ్వులు, కోడిగుడ్డు, అరటి పండు, అగరుబత్తీలు ఉంచారు. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అయితే నాగన్న వాటిని తొలగించి.. నీటితో శుభ్రం చేసిన అనంతరం అక్కడ ఉంచిన కోడిగుడ్డు, అరటి పండు, నిమ్మకాయను ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలు ఇలాంటి నమ్మొద్దంటూ అవగాహన కల్పిస్తున్నాడు. అయితే ఇలాంటి పూజలు చేసిన ఆనవాళ్లు ఉంటేనే అటువైపు వెళ్లకుండా ఉంటారు జనాలు. కానీ ఈ వ్యక్తి తెగింపు మాత్రం స్థానిక ప్రజలను ఆశ్చర్యపరిచింది.
Also Read: సడెన్ ట్విస్ట్.. ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్..
‘నాకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు.. కొడాలి నాని ఎవరో తెలీదు..’ వర్మ టీజింగ్