AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం: ఏసీలో మంటలు..రాజకీయ నేత సహా ముగ్గురు మ‌ృతి

షార్ట్ సర్క్యూట్ కారణంగా గదిలోని ఎయిర్ కండిషనర్‌లో మంటలు వ్యాపించి అధికార పార్టీ నేత సహా ముగ్గురు చనిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జిల్లాలోని

దారుణం: ఏసీలో మంటలు..రాజకీయ నేత సహా ముగ్గురు మ‌ృతి
Jyothi Gadda
|

Updated on: May 30, 2020 | 12:29 PM

Share

షార్ట్ సర్క్యూట్ కారణంగా గదిలోని ఎయిర్ కండిషనర్‌లో మంటలు వ్యాపించి అధికార పార్టీ నేత సహా ముగ్గురు చనిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బరంపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో అధికార బీజేడీ నేత అలేఖ్ చౌదరి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలేఖ్ చౌదరి నిద్రిస్తున్న గదిలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గదిని చుట్టుముట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

అలేఖ్ చౌదరి నిద్రిస్తున్న గదిలోని ఏసీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన వెంటనే అప్రమత్తమైన చౌదరి.. కుటుంబ సభ్యులను నిద్రలేపి బయటకు పంపించివేశారు. అనంతరం అదే గదిలో నిద్రపోతున్న బావమరిది భగవాన్ పాత్రో, బంధువు సునీల్ బెహరాను కాపాడేందుకు వెళ్లారు. వారిని కాపాడటానికి వెళ్లిన ఆయన ఊపిరి ఆడక గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. చౌదరి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు.. మంటలను అదుపు చేసి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే, అప్పటికే వారు ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

అలేఖ్ చౌదరి మరణ వార్త తెలియడంతో పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆయన మృతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
తదుపరి మ్యాచ్‌కు ముందే రీఎంట్రీ ఇవ్వనున్న ఆల్ రౌండర్.. ఎవరంటే?
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..