Bhopal: జనంపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఎక్కడంటే..

|

Oct 17, 2021 | 5:09 PM

దుర్గా మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. కారు జనంపైకి దూసుకెళ్లటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో శనివారం అర్ధరాత్రి జరిగింది...

Bhopal: జనంపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఎక్కడంటే..
Car
Follow us on

దుర్గా మాత విగ్రహ నిమజ్జన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. కారు జనంపైకి దూసుకెళ్లటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‎లో శనివారం అర్ధరాత్రి జరిగింది. పాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్‌ పరిధిలో దుర్గా మాత ఊరేగింపు జరుగుతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కారను రివర్స్ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి కారణమై కారు డ్రైవర్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దుర్గా విగ్రహాన్ని నిమజ్జన ఊరేగింపు అదే దారిలో ఓ వ్యక్తి బెంగుళూరు నుంచి ఇండోర్ వెళ్తున్నాడు. అతను భోపాల్‎లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆహారం కోసం ఆగారు. ఇదే క్రమంలో అక్కడున్న కొంత మంది ఆకతాయిలు అతడి కారు కిటికీ అద్దలు పగులగొట్టారు. దీంతో భయపడిన అతడు కారును వేగంగా రివర్స్ చేశాడని. ఈ క్రమంలో క్రమంలో కారు అదుపు తప్పి ప్రజలపైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‎ను అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కారు డ్రైవర్ అధిక వేగంతో కారును రివర్స్ చేస్తున్నట్లు.. ప్రజలు భయపడి దూరంగా పరుగెత్తుతున్నట్లు కనిపించింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న పోలీసు హెడ్ కానిస్టేబుల్ కాలికి కూడా స్వల్ప గాయాలయ్యాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. “డ్రైవర్‌ని అరెస్టు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని రక్తంలో మద్యం ఆనవాళ్లు కనిపించలేదు” అని డీఐజీ భోపాల్ ఇర్షాద్ వలీ చెప్పారు.

కొద్ది రోజుల ముందు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జష్‌పూర్ జిల్లాలో నిమజ్జనం సమయంలో ఒక వ్యక్తిని కారు ఢీకొనడంతో మరణించాడు.16 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ ఒక ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. “జాష్పూర్ సంఘటన చాలా బాధాకరం మరియు హృదయ విదారకం. నేరస్థులను వెంటనే అరెస్టు చేశారు. నేరస్థులుగా కనిపించిన పోలీసు అధికారులపై కూడా ప్రాథమిక చర్యలు తీసుకున్నారు. విచారణకు ఆదేశించారు. ఎవరూ తప్పించుకోలేరు. అందరికీ న్యాయం జరుగుతుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు కోరుకుంటున్నాడు “అని శ్రీ బాఘెల్ హిందీలో ట్వీట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

Read Also.. Kerala rainfall, floods: కేరళలో వర్ష బీభత్సం, 18 మంది మృతి.. 22మంది గల్లంతు. శబరిమల దర్శనం రద్దు