భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అనుచరుడు.. ఇల్లందు మండలం ఇందిరానగర్ టీఆర్ఎస్ ఎంపీటీసీ మండలరాముపై అర్థరాత్రి హత్యాయత్నం జరిగింది. అప్రమత్తమై తృటిలో తప్పించుకున్న రాము పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగులు పన్నిన పన్నాగాన్ని విఫలం చేశారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని తమదైనస్టైల్ లో విచారణ చేయగా దుండగుడు ఇచ్చిన సమాచారం మేరకు భారీ ఎత్తున మారణ ఆయుధాలు స్వాధీన పరుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
గత సంవత్సరం మండల రాము పై ఇదే నెలలో హత్యా ప్రయత్నం చేశారు దుండగులు. అప్పుడు కూడా రాము బైకు పై వెళ్తుండగా కత్తులతో ఎటాక్ చేసి చంపాలని ప్రయత్నం చేశారు. రాము అప్పుడుకూడా అప్రమత్తతతో తప్పించుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పోలీసులు దుండగులను అరెస్టు చేసీ రిమాండ్ కు తరలించారు. మరల రామును హతమార్చేందుకు రాత్రి ఇల్లందు ప్రధాన రహదారిలోని సమ్మక్క ఆర్చి సమీపంలో ఆయుధంతో ఒక వ్యక్తి ఉండగా… మరికొంతమంది కారులో.. ఇలా, రోడ్డుకు ఇరువైపులా మాటు వేసుకొని ఉన్నారు. రాము తన అనుచరులతో కలసి సింగరేణి ఏర్పాటుచేసిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి వెళ్లి కలెక్టర్ కి మెమోరాండం సమర్పించి తిరిగి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ క్రమంలో రాము పట్టణం వైపు బైక్ పై వెలుచుండగా ఒక వ్యక్తి తన పైకి ఆయుధంతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. రాము తప్పించుకొని బైక్ పై వెళ్తుండగా కారులో కొందరు వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం ఇచ్చి రాము తప్పించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని ఒక్కరిని అదుపులోకి తీసుకోగా కారులో వచ్చిన వ్యక్తులు పరారాయ్యారు. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గ్రూప్ వివాదాల నేపథ్యంలో నన్ను హతమార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాము అన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్దామన్నాడు.. తనకు న్యాయం చేయాలని రాము వేడుకుంటున్నాడు.