TDP Municipal tension : మున్సిపల్ పోలింగ్ టెన్షన్ కంటే అభ్యర్థులను కాపాడుకునేందుకే ఎక్కువ కష్టపడుతోన్న టీడీపీ
TDP Municipal Elections tension : మున్సిపల్ పోలింగ్ టెన్షన్ కంటే, అభ్యర్థులను కాపాడుకునేందుకే పార్టీలు ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. చాలా మందికి ఓ పార్టీ తరఫున నామినేషన్ వేసి... అధికార పార్టీకి జై కొడుతున్నారు...
TDP Municipal Elections tension : మున్సిపల్ పోలింగ్ టెన్షన్ కంటే, అభ్యర్థులను కాపాడుకునేందుకే పార్టీలు ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. చాలా మందికి ఓ పార్టీ తరఫున నామినేషన్ వేసి… అధికార పార్టీకి జై కొడుతున్నారు. నేటితో ఉపసంహరణ గడవు ముగియనుంది. అప్పటి వరకు పోటీదారులను కాపాడుకుంటే సగం విజయం సాధించినట్టేనంటూ కామెంట్స్ చేస్తున్నాయి పార్టీలు. ప్రభుత్వం పడిపోతుందనుకున్నప్పుడు చూసే సీన్స్ లోకల్ పోల్స్ టైంలో చూస్తున్నాం. ఎమ్మెల్యే, ఎంపీలు, గెలిచిన అభ్యర్థులను క్యాపులకు తరలించారని చాలా సార్లు వినే ఉంటాం. కానీ ఇది వెరేటీ. పోటీ చేస్తున్న అభ్యర్థులనే క్యాంపులకు తరలిస్తున్నారు ఆధ్రప్రదేశ్‌లో. ఎన్నికల తర్వాత చూసే పొలిటికల్ క్యాంపులు ఇప్పుడు పోలింగ్‌కు ముందే కనిపిస్తున్నాయి.
నామినేషన్ వేసిన అభ్యర్థులను కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ… ఈ క్యాంపులకు తెరలేపింది. పలాస నుంచి పుంగనూరు వరకు ఒకటే సీన్. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన చాలా మంది అభ్యర్థులు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. దీంతో టీడీపీలో కలవరం మొదలైంది. అభ్యర్థులనే కాపాడుకోలేకపోతే తీవ్ర అవమానం తప్పదని భావించి… పోటీదారులను రహస్యప్రదేశాలకు తరలించింది. మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు వైసీపీలో చేరుకుతున్నారు. ఇలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది టీడీపీ. చాలా మంది అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలించింది.
అధికారపార్టీ నాయకులు, పోలీసులు ఏకమై తమ అభ్యర్థులను బెదిరించి వైసీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం. వాళ్లతో పోరాడే శక్తి లేక అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నామంటున్నారు టీడీపీ లీడర్స్. పలాసలో 31 వార్డులు ఉంటే… నలుగురు వైసీపీ కండువా కప్పుకున్నారు. 4, 8, 20 29 వార్డుల్లో టీడీపీ తరపున వీరు నామినేషన్ వేశారు. ఇప్పుడు పార్టీ మారడంతో ఆ నాలుగు వార్డుల్లో టీడీపీకి అభ్యర్థులు లేకుండా పోయారు. మిగిలిన 27 మందిని కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టింది ప్రతిపక్షం. వారిని క్యాంప్‌నకు తరలించింది.
గ్రేటర్ విశాఖలోనూ టీడీపీకి ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఇటీవలే వైసీపీలో చేరారు 14వ డివిజన్ అభ్యర్థి బాక్సర్‌రాజు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. MPTC ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమకు గట్టి షాక్ ఇచ్చారు నలుగురు అభ్యర్థులు. గతంలోనే ముగ్గురు వైసీపీలోకి వెళ్లారు. మొన్ననే మరో అభ్యర్థి దాకర్ల కిషోర్‌బాబు అధికార పార్టీలో చేరారు. మైలవరంలో 10 MPTC స్థానాలకు నలుగురు జంప్ కావడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాల్టీలో 24 వార్డులు ఉంటే… రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయలేదు. మిగిలిన 22 మంది అభ్యర్థుల్లో 18 మంది వైసీపీ కండువా కప్పుకున్నారు. అంటే మొత్తం 24లో 20 సీట్లలో టీడీపీ అభ్యర్థులే లేరు.
నాలుగు మున్సిపాల్టీల్లో 14 చోట్ల నామినేషన్లు వేసేందుకు మళ్లీ అవకాశం ఇచ్చినా… ఏడు వార్డుల్లోనే అభ్యర్థులు తిరిగి నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మున్సిపాల్టీలో అవకాశం ఇచ్చిన మూడు వార్డులకు కొత్తగా ఎవరూ నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు. తిరుపతి కార్పొరేషన్ 6 వార్డుల్లో 3చోట్ల టీడీపీ అభ్యర్థులు మళ్లీ నామినేషన్ వేశారు. 2, 21, 45 డివిజన్లలో నామినేషన్లు వస్తే… 8, 10, 41 వార్డులకు కొత్తగా నామినేషన్లు రాలేదు.
కడప జిల్లాలో రెండు మున్సిపాల్టీల్లోని 5 వార్డుల్లో మళ్లీ నామినేషన్‌కు అవకాశం ఇచ్చారు. రాయచోటిలో 20 వార్డులో టీడీపీ అభ్యర్థి మళ్లీ నామినేషన్ వేశారు. 31వ వార్డులో మాత్రం ఎవరూ వేయలేదు. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో మూడు వార్డులకు పాత నామినేషన్లను పునరుద్దరించినట్లు ప్రకటించారు కమిషనర్ రంగస్వామి. దీంతో 6వ వార్డులో వైసీపీ రెబల్, 11వ వార్డులో టీడీపీ, 15వ వార్డులో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నట్లయింది.
Read also : Private sector reservations : ప్రైవేట్ రంగంలో స్థానికులకు 75% రిజర్వేషన్స్, హర్యానా గవర్నర్ ఆమోదముద్ర