Fake Challans: టీవీ9 ఇంపాక్ట్: ఫేక్ చలానాలతో రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్.. రివ్యూలో హాట్ కామెంట్స్

|

Aug 13, 2021 | 7:46 PM

రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు విషయంలో జరిగిన బోగస్ చలనాల కుంభకోణంపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి

Fake Challans: టీవీ9 ఇంపాక్ట్: ఫేక్ చలానాలతో రిజిస్ట్రేషన్ల కుంభకోణంపై సీఎం జగన్ సీరియస్.. రివ్యూలో హాట్ కామెంట్స్
Cm Jagan
Follow us on

Registrations with Fake Challans scam: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు విషయంలో జరిగిన బోగస్ చలనాల కుంభకోణంపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇవాళ అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు.

ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు అధికారులు సీఎం‌కు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్‌లకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. అనుసంధానం ద్వారా అవకతవకలకు చెక్ పెట్టవచ్చని సీఎంకు అధికారులు వివరించారు. ఇక, బోగస్ ఛలాన్లకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.

కాగా, నకిలీ చలానాల దందా గుంటూరు జిల్లాలోనూ బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకొని.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లుగా తెలుసుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్ పరిధిలో 8 డాక్యుమెంట్స్‌లో నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. సీఎఫ్‌ఎంఎస్‌లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని.. ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తేల్చారు అధికారులు.

ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు సుమారు రూ.8 లక్షలు రికవరీ చేసుకున్నారు అధికారులు. సబ్‌ రిజిస్ట్రార్ రాధాకృష్ణ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కొంతమంది డాక్యుమెంట్ రైటర్లని విచారిస్తున్నారు. డాక్యుమెంట్ల ప్రకారం 2లక్షల 15వేలు చెల్లించాల్సి ఉండగా.. సీఎఫ్‌ఎంఎస్‌లో 15 వేలు చలానా తీసి.. దాని ప్రింట్‌ అవుట్‌లో ముందు రెండు అక్షరం యాడ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు మోసానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

Read also:  TRS Spying: కేసీఆర్ రాడార్‌లో ఈటల ఫ్రెండ్స్..? సొంత పార్టీ నేతలపై నిఘా..!