Nellore: ‘అలాంటి వారిని తరిమి కొట్టే రోజులు రావాలి’.. నెల్లూరు ఘటనపై ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.

|

Jul 02, 2021 | 1:14 PM

Nellore Suicide Case: నెల్లూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మలుపులు తిరుగుతోన్న విషయం తెలిసిందే. తొలుత తేజస్విని, వెంకటేష్‌ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్య కాదని..

Nellore: అలాంటి వారిని తరిమి కొట్టే రోజులు రావాలి.. నెల్లూరు ఘటనపై ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.
Vasireddy Padma
Follow us on

Nellore Suicide Case: నెల్లూరు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మలుపులు తిరుగుతోన్న విషయం తెలిసిందే. తొలుత తేజస్విని, వెంకటేష్‌ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది ఆత్మహత్య కాదని.. హత్య అని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్‌ ప్రేమకు అంగీకరించలేని కారణంగా తేజస్విని చంపాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ సంఘటనను అందరూ ఖండిస్తున్నారు. తాజాగా ఈ అంశం ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్ ఛైర్స్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో ఇలా అమ్మాయి ప్రాణాలను తీయడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వం తరఫున ఇలాంటి సంఘటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రేమ పేరుతో కొందరు చాలా తేలికగా ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి దుర్మాగపు దాడులు జరిగినప్పుడు కూడా అమ్మాయి పై వేలెత్తి చూపుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి బతికే అర్హత లేదని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఇలాంటి వారిని తరిమి తరిమి కొట్టే రోజులు రావాలని పద్మ ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మాయిను చంపి తాను ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనల పట్ల సమాజం కూడా తీవ్రంగా స్పందించాలని వాసిరెడ్డి పద్మ పిలుపిచ్చారు. ఇక అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి లోతుగా విచారణ జరిపి, వెంకటేష్‌కు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పద్మ హామీ ఇచ్చారు.

Also Read: viral photos : పెద్ద పెద్ద రాళ్లు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళుతున్నాయి..! శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని కనుగొనలేకపోతున్నారు..

Suicide: ఐఐటీ మద్రాస్‌లో.. నిప్పంటించుకొని లెక్చరర్ బలవన్మరణం.. 11 పేజీల సూసైడ్ నోట్..

Drowning: చెరువులో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి.. షణ్ముగపురంలో విషాదం..