Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలి లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, మద్యం తాగి, ఓవర్‌టెక్‌ చేయడం, వివిధ కారణాల వల్ల ప్రతి రోజు..

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైరు పేలి లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి
Road Accident

Updated on: Oct 30, 2021 | 7:39 PM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్తగా వాహనాలు నడపడం, మద్యం తాగి, ఓవర్‌టెక్‌ చేయడం, వివిధ కారణాల వల్ల ప్రతి రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టైరు పేలి లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. బత్తలపల్లి మండలం జ్వాలాపురంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరుగగానే మృతదేహాలు చెల్లాచెదురై పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కాగా, ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి: Crime News: కూతురుపై కన్నేసిన ప్రియుడు.. తట్టుకోలేక ఆ మహిళ వేసిన శిక్షేంటో తెలుసా..?

Crime News: బావిలో పడి తల్లీ బిడ్డల అనుమానాస్పద మృతి..