Tirupati: చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

|

Mar 27, 2022 | 4:02 PM

చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి భాకరాపేటలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదాన్ని మరవక ముందే.. నిశ్చితార్థం కోసం టెంపో ట్రావెలర్‌లో వెళుతున్న బృందం ప్రమాదానికి గురైంది.

Tirupati: చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..
Accident
Follow us on

చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి భాకరాపేటలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదాన్ని మరవక ముందే.. నిశ్చితార్థం కోసం టెంపో ట్రావెలర్‌లో వెళుతున్న బృందం ప్రమాదానికి గురైంది. చిత్తూరు- తిరుపతి హైవే పై ఇది ఇవాళ జరిగిన రెండో ప్రమాదం. టెంపో ట్రావెలర్‌, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో టెంపో ట్రావెలర్ పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి నుంచి నిశ్చితార్థం కోసం పాకాల మండలం దామల చెరువు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

కాగా చిత్తూరు జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద శనివారం రాత్రి బస్సు లోయలో పడిన ఘటనలో చిన్నారితో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణు అనే యువకుడికి చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ వద్ద ఉన్న పెద్ద మలుపులో బస్సు అదుపుతప్పి కుడివైపున లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు.

Also Read:Breast Milk Jewellery: చనుపాలతో ఆభరణాల తయారీ వ్యాపారం.. ఏడాదికి ఏకంగా రూ.15 కోట్లు లాభం!

Samantha: పాన్ ఇండియానా బొక్కా.. వైరలవుతున్న సమంత ట్వీట్..

Kacha Badam Song: ట్రెండ్‌ అవుతున్న ‘కచ్చా బాదం’ సాంగ్‌.. ఆ పాట పాడింది ఎవరు..? ఎలా వైరల్ అయ్యింది!