AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది.. పోలీసులకే అంతు చిక్కని మర్డర్‌ మిస్టరీ!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మదనపల్లెలో దారుణం వెలుగు చూసింది. 33 ఏళ్ల గంగాధర్ అనే ఓ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ను భార్య పిల్లల ఎదుటే అతికారతంగా బండరాళ్లతో కొట్టిచంపారు కొందరు దుండగులు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యప్తు చేస్తున్నారు.

Andhra News: భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది.. పోలీసులకే అంతు చిక్కని మర్డర్‌ మిస్టరీ!
Madanapalle
Raju M P R
| Edited By: |

Updated on: Jun 17, 2025 | 12:11 AM

Share

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. 33 ఏళ్ల గంగాధర్ దారుణ హత్యలో అసలు నిజాలు రాబట్టే పనిలో పోలీసులు సొంత మనసులనే అనుమానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గంగాధర్ ను భార్య బిడ్డల ముందే బండ రాళ్లతో కొట్టి హత మార్చిన దుండగుల అసలు టార్గెట్ ఏంటన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డ ఆరుగురు వ్యక్తులు గంగాధర్ ను భార్య వనిత కళ్ళ ఎదుటే కర్రలతో దాడి చేసి బండ రాళ్లతో కొట్టి హత మార్చారు. హత్యకు గురైన గంగాధర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు హత్యకు గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గంగాధర్ కు ఉన్న శత్రుత్వం, గొడవలపై ఆరా తీసిన పోలీసులు భార్యను కూడా అనుమానిస్తున్న పరిస్థితి ఏర్పడింది. గంగాధర్ భార్య వనితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు, మరికొందరు అనుమానితులు కూడా విచారణ పేరుతో పీఎస్‌కు తరలించారు. భార్య సహకారంతో పక్కా స్కెచ్ తోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు, ఈ మేరకు సాక్షాలను సేకరించే పనిలో పడినట్లు తెలుస్తోంది. సినిమా థ్రిల్లర్‌ను తలపించే కేసు గానే పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది. గంగాధర్ ను హత మార్చిన వారెవరో కనగొనే పనిలో ఉన్న పోలీసులు తొందర్లోనే మిస్టరీని చేధిస్తామని చెబుతున్నారు. గంగాధర్ హత్య కేసులో భార్య ప్రమేయం ఉందా… లేదా అన్న కోణంతో పాటు ఆరుగురు అగంతుకులు కలిసి చేసిన ఈ హత్య వెనుక ఉన్నదెవరన్నదే పోలీసులకు సైతం మిస్టరీగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్