
Crime News Today: చెడు అలవాట్లకు బానిసైన ఓ వ్యక్తి చేతిలో డబ్బులు లేకపోవడంతో పథకం ప్రకారం ఓ మహిళను మోసం చేయాలనుకున్నాడు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేటకు చెందిన బాధిత మహిళ, భర్తతో విడిపోయి తల్లితో కలిసి ఉంటోంది. ఈనెల 25న పని నుంచి వస్తున్న మహిళను యాదవబస్తీకి చెందిన సెంట్రింగ్ మేస్త్రీ రాము ఇంటి వద్ద దింపుతానని బైక్‌పై తీసుకెళ్లి ఆమెపై దాడి చేసి మంగళసూత్రాన్ని లాక్కుకున్నాడు. బండరాయితో ఆమె తలపై మోది చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ ఆమె చనిపోలేదు. అపస్మారక స్థితికి చేరుకుంది అనంతరం తేరుకున్న బాధితురాలు మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న రామును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.