Crime News: అంతర్రాష్ట్ర దొంగ స్కెచ్.. మూత్రం వస్తుందని చెప్పి పరారయ్యాడు.. తలపట్టుకుంటున్న పోలీసులు

Shankarpalli Police: అతనొక అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు వ్యూహకర్త.. దొంగతనాల్లో ఆరితేరిఉన్నడు.. ఈ క్రమంలో ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులతో ఎట్టకేలకు పోలీసులకు

Crime News: అంతర్రాష్ట్ర దొంగ స్కెచ్.. మూత్రం వస్తుందని చెప్పి పరారయ్యాడు.. తలపట్టుకుంటున్న పోలీసులు
Crime News

Updated on: Oct 29, 2021 | 11:13 AM

Shankarpalli Police: అతనొక అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు వ్యూహకర్త.. దొంగతనాల్లో ఆరితేరిఉన్నడు.. ఈ క్రమంలో ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులతో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలిస్తున్న క్రమంలో.. మూత్రం వస్తుందంటూ వాహనం నుంచి కిందకు దిగాడు.. ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి పరారీ అయ్యాడు. మరి కాసేపట్లో జైలుకు తరలిస్తారనగా.. కీలక సూత్రధారైన దొంగ పరారీ అవ్వడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ షాకింగ్ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని శంకర్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ సిబ్బంది దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగలను వలవేసి పట్టుకున్నారు. అనంతరం గురువారం శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే రాత్రి ఆలస్యం కావడంతో అధికారులు జైలులోకి అనుమతించలేదు. దీంతో పోలీసులు వారిని శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు.

అనంతరం శుక్రవారం తెల్లవారుజామున నిందితులను జైల్లో ఉంచేందుకు పోలీసులు ప్రత్యేక వాహనంలో బయలుదేరారు. ఈ సమయంలో మూత్రం వస్తుందంటూ దొంగల ముఠాలో కీలక వ్యక్తి అయిన హర్షద్ ఖాన్ (22) కిందకు దిగాడు. మూత్ర విసర్జనకు దిగిన హర్షద్ ఖాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read:

Crime News: నగ్నంగా కూర్చొమంటాడు.. మూత్రం తాగాలంటాడు.. శాడిస్ట్ భర్త వేధింపులు..

Crime News: హైదరాబాద్‌లో కలకలం.. కేబీఆర్ పార్క్‌లో గుర్తు తెలియని మృతదేహం..

Crime News: ఘోరం.. మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. స్నేహితుడిని దారుణంగా చంపారు.. చివరకు..