Woman Married Her Brother Killer: ఎవరు ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ప్రేమలో పడుతారో ఊహించని విషయం. అది అనుకోకుండా జరిగిపోతుంది. కొన్నిసార్లు ఆ ప్రేమ కథ విజయవంతమవుతుంది మరికొన్ని అసంపూర్ణంగా మిగిలి ఉంటుంది. తాజాగా ఓ వింత ప్రేమకథ తెరపైకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రేమ కథ ఖైదీకి అతడు చంపిన వ్యక్తి సోదరీకి మధ్య. ఈ షాకింగ్ లవ్‌స్టోరీ అమెరికాలోని జైలు నుంచి ఇటీవల వెలువడింది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో ఒక మహిళ తన సోదరుడిని చంపిన వ్యక్తిని ప్రేమించింది. ఏప్రిల్,1989లో అమెరికాలోని క్యూయహోగా కౌంటీలో జాన్ టిడ్జెన్ అనే వ్యక్తి బ్రియాన్ మెక్‌గారీని హత్య చేసినందుకు అరెస్టయ్యాడు. కోర్టు అతనికి 32 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే హత్యకు గురైన బ్రియాన్ మెక్‌గారీ సోదరీ క్రిస్టల్ స్ట్రాస్ ఈ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి జైలులో ఉన్న కిల్లర్ జాన్ టిడ్జెన్‌కి లేఖ రాసింది. ఆ తర్వాత అతడు రిప్లై ఇచ్చాడు. ఇది నిర్విరామంగా కొనసాగడంతో ఇద్దరి మధ్య చనువు పెరిగింది. అది ఇష్టంగా మారింది.
ఇంకేముంది ఆ మహిళ హంతకుడితో ప్రేమలో పడింది. ఇది కొన్ని రోజులు ఇలాగే కొనసాగింది. అతను జైలు నుంచి విడుదలయ్యే వరకు వేచి ఉంది. తాను జాన్‌ను ప్రేమిస్తున్నానని, అతను లేకుండా జీవించలేనని క్రిస్టల్ కుటుంబ సభ్యులతో చెప్పింది. జాన్ తన సోదరుడిని హత్య చేశాడు. ఇది నిజమే అందుకోసం అతను శిక్షను అనుభవించాడు. అదే సమయంలో హంతకుడు జాన్ టిడ్జెన్ కూడా క్రిస్టల్‌ను ప్రేమిస్తున్నాడని చెప్పాడు. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అర్థమైంది. ఇద్దరు పెళ్లి చేసుకొని కథ సుఖాంతం చేశారు.