Cyber Crime: వాట్సాప్‌ డీపీగా మీ ఫోటోలు పెడుతున్నారా.? అయితే మొదటికే మోసం.. కేటుగాళ్ల కొత్త పంథా..

|

Dec 28, 2021 | 8:59 AM

Cyber Crime: టెక్నాలజీ రోజురోజుకీ ఎలా అభివృద్ధి చెందుతుందో దానికి తోడు నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు సైబర్‌ మోసాలకు పాల్పడుతూ ఖాతాల్లో ఉన్న డబ్బును కొట్టేసిన కేటుగాళ్లు..

Cyber Crime: వాట్సాప్‌ డీపీగా మీ ఫోటోలు పెడుతున్నారా.? అయితే మొదటికే మోసం.. కేటుగాళ్ల కొత్త పంథా..
Cyber Crime
Follow us on

Cyber Crime: టెక్నాలజీ రోజురోజుకీ ఎలా అభివృద్ధి చెందుతుందో దానికి తోడు నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు సైబర్‌ మోసాలకు పాల్పడుతూ ఖాతాల్లో ఉన్న డబ్బును కొట్టేసిన కేటుగాళ్లు ఇప్పుడు బ్లాక్‌మేల్ దందాకు దిగుతున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తున్న ఫోటోలను అస్త్రంగా మార్చుకొని బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా చిలకలగూడలో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సోషల్‌ మీడియాలో ఎంత వరకు సేఫ్టీ అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. చిలకలగూడకు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో దిగిన ఫోటోను వాట్సాప్‌ డీపీగా పెట్టుకున్నాడు. దీంతో ఈ ఫోటోను డౌన్‌లోడు చేసుకున్న ఓ కేటుగాడు మార్ఫింగ్‌ చేశాడు. భార్య ఫోటోను మార్ఫింగ్ చేసి నగ్న ఫోటోలా మార్చేశాడు. అనంతరం ఆ నగ్న ఫోటోను భర్తకే పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. డబ్బు ఇవ్వకపోతే కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి ఫోటోను ఫార్వర్డ్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో కంగుతిన్న భర్త.. రెండు విడతలుగా రూ. 1 లక్షకుపైగా ముట్టజెప్పాడు. అయితే అంతటితో ఆగని ఆ కేటుగాడు ఇంకా డబ్బు కావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు.

చేసేదేమి లేక బాధితుడు సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సహజంగా వాట్సాప్‌ డీపీలను తెలిసిన వ్యక్తులే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పోలీసు అధికారులు స్పందించారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలో వేదికల్లో మహిళలు ప్రొఫైల్‌ ఫోటోలు పెట్టుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Also Read: Siva Karthikeyan: హాలీవుడ్ సినిమాలకు పోటీగా మనం కూడా.. ఆ ఇద్దరూ రెండు సింహాల్లాగే ఉన్నారు.. తమిళ్ స్టార్ హీరో కామెంట్స్..

Sweet Porridge: అల్పాహారంలో ఇది చేర్చండి.. ఇక రోజంతా ఫుల్ యాక్టివ్.. ఒంట్లో కొవ్వు కూడా పరార్..!

RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..