Ludhiana Fire Accident: పొట్ట నింపుకునేందుకు వేరే రాష్ట్రానికి వలసవెళ్లారు. ఈ క్రమంలో రాత్రివేళ అందరూ భోజనాలు చేసి నిద్రపోయారు.. ఇంతలోనే ఊహించని ప్రమాదంతో అందరూ సజీవదహనమయ్యారు. గుడిసెకు నిప్పంటుకొని అయిదుగురు పిల్లలు సహా దంపతులు సజీవదహనం అయిన ఘటన పంజాబ్ (Punjab) లోని లూథియానాలో చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. వీరంతా ఉపాధి కోసం లూథియానాకు వలస వచ్చిన కార్మికులుగా గుర్తించారు. రాత్రి నిద్రపోతున్న సమయంలో ఇంటికి మంటలంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు.
టిబ్బా రోడ్‌లోని మునిసిపల్ చెత్త డంప్ యార్డ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు లూథియానా అసిస్టెంట్ కమిషనర్ (ఈస్ట్) సురీందర్ సింగ్ తెలిపారు. వీరంతా గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
ఈ ఘటనపై టిబ్బా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు, ఐదుగురు పిల్లలు పేర్లు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Also Read: