Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టూరిస్టు బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం.. 30 మందికి..

టూరిస్ట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. టూరిస్టు బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం.. 30 మందికి..
Road Accident

Updated on: May 25, 2022 | 12:51 PM

Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టూరిస్ట్ బస్ బోల్తా పడి ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన గంజాం జిల్లాలోని భంజానగర్ పోలీస్ పరిధిలోని దుర్గాప్రసాద్ గ్రామ సమీపంలోని కళింగ ఘాట్ వద్ద జరిగింది. బుధవారం ఉదయం టూరిస్ట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. కంధమాల్‌లోని దరింగ్‌బాడి నుంచి భంజానగర్ మీదుగా విశాఖపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలసీులు తెలిపారు. బస్సు వేగంగా వెళ్తుండగా.. బ్రేకులు ఫేయిల్ కావడంతో కళింగ ఘాట్ సమీపంలో బోల్తా పడిందని తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారని తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కొందరిని బెర్హమ్​పుర్​లోని ఎంకేసీజీ ఆసుపత్రికి, మరికొందరిని భంజానగర్​ఆసుపత్రిలో చేర్చారు. ప్రయాణికులంతా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా ఉదయనారాయణపూర్ సబ్ డివిజన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన వారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us