Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Seized: బంగారం స్మగ్లింగ్‌కు సరికొత్త ప్లాన్.. ఎమర్జెన్సీ లైట్‌లో ఆరు కేజీల బంగారం.. కానీ చివరకు..

RGI Airport Hyderabad: బంగారం, వెండి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ..

Gold Seized: బంగారం స్మగ్లింగ్‌కు సరికొత్త ప్లాన్.. ఎమర్జెన్సీ లైట్‌లో ఆరు కేజీల బంగారం.. కానీ చివరకు..
Gold Seized
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2021 | 4:07 PM

RGI Airport Hyderabad: బంగారం, వెండి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్‌ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ చిక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల దాడిలో ఆరు కేజీల బంగారం పట్టుబడింది. ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు నిఘా వేశారు. దుబాయ్ నుంచి ఈకే524 విమానంలో శంషాబాద్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆరు కిలోల బంగారంతో పట్టుబడ్డారు.

కాగా.. ఈ బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్‌లో పెట్టి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిసతున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.2.90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పక్కా సమారంతో.. తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Also Read:

NIA: జమ్మూకాశ్మీర్‌లో వరుస హత్యలపై కేంద్రం సీరియస్ యాక్షన్.. రంగంలోకి ఎన్ఐఏ..

Honour Killing: ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం.. ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు సజీవ దహనం..

ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్‌ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!
జీటీపై పంజాబ్‌ గెలుపు.. ఏడుస్తున్న ఆర్సీబీ అభిమానులు!