AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకుల దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన థానే జిల్లాలో..

Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకుల దుర్మరణం
Shaik Madar Saheb
|

Updated on: Feb 01, 2021 | 5:18 PM

Share

4 killed in road accident maharastra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన థానే జిల్లాలో కొంగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పింప్లాస్‌ గ్రామ శివారులో ఆదివారం అర్థరాత్రి జరిగింది. ఆదివారం రాత్రి నాసిక్‌ నుంచి కారు ముంబైకి వెళుతోంది. ఈ క్రమంలో పింప్లాస్‌ గ్రామం సమీపానికి రాగానే.. అత్యధిక వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ముంబై నుంచి షిర్డీ వెళుతున్న ప్రైవేటు బస్సు.. కారును ఢికొంది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించారని భివాండి పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయిందని పోలీసులు వెల్లడించారు. మృతులను గోకుల్‌ గౌటే (29) పంకజ్‌ జ్వాలీ (29), కారు డ్రైవర్‌ జ్వాలా వీబీ సింగ్‌ (27), గౌరవ్‌ సుధీర్‌ సింగ్‌ (27)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భీవండీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Budget 2021: ఈ బడ్జెట్‌తో పెద్ద కంపెనీలకే లాభం.. ప్రజల సమస్యలు పెరుగుతాయ్‌.. కేజ్రీవాల్‌ ట్విట్‌

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్