Konaseema Road Accident: ఈస్టర్ వేళ విషాదం.. బ్రతుకులను చిదిమేసిన ఇసుకు లారీ

కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై ద్విచక్రవాహనాన్ని ఇసుక లారీ ఢీ కొట్టింది.

Konaseema Road Accident: ఈస్టర్ వేళ విషాదం.. బ్రతుకులను చిదిమేసిన ఇసుకు లారీ
Road Accident
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 17, 2022 | 8:34 PM

AP Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐ.పోలవరం మండలం యానం-ఎదుర్లంక బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో  భార్యాభర్తలు సహా చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గుబ్బల శ్రీను అనే వ్యక్తి తన పెద్ద కూతురు  ద్రాక్షారామ ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గుబ్బల శ్రీను తన భార్య మంగయమ్మ, మనవడు యశ్వంత శివ కార్తీక్ , మనవరాలు శ్రీ లక్ష్మితో కలిసి బైక్‌పై యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై వెళ్తున్నారు. అయితే, వారికి ఎదురుగా వస్తున్న ఇసుక టిప్పర్ లారీ వేగంగా బైక్‌ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న భార్యాభర్తలు సహా బాలుడు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన బాలికను అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. అయితే, ఈ చిన్నారి కూడా మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. కాగా, ఘటనా స్థలంలో మృతదేహాలు ఛిద్రమై దూరంగా పడి ఉన్నాయి. ఈ దారుణ యాక్సిడెంట్‌ను .. స్థానికులు  జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిచారు.  వారధిపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Shocker: ఎంత పని చేశావమ్మా..! పతి లేడని తెలిసి… ప్రాణంగా పెంచుకున్న బిడ్డనే

Telangana: తల్లీ కూతుళ్లతో వ్యక్తి ఎఫైర్.. ఆపై ఊహించని ఇన్సిడెంట్.. విచారణలో విస్తుపోయే నిజాలు