Crime News: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్! బాటసారులను అడవిలోకి లాక్కెళ్లి..

|

Jan 22, 2022 | 2:39 PM

ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దోచుకున్న నేరం కింద ముగ్గురు ట్రాన్స్‌జెండర్లను (transgenders) గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

Crime News: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్! బాటసారులను అడవిలోకి లాక్కెళ్లి..
Police Custody
Follow us on

Three transgenders arrested for robbery in Delhi: ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దోచుకున్న నేరం కింద ముగ్గురు ట్రాన్స్‌జెండర్లను (transgenders) గురువారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రూబీ (42), రాణి (30), రవినా (20)గా గుర్తించారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు. పోలీసుల కథనం ప్రకారం యమునా ఖాదర్ వద్ద పోలీసులు గస్తీ కాస్తుండగా రోషన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. సమీపంలోని షాప్పోర్జీ లేబర్ క్యాంపుకు వెళ్తుండగా తనను ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడవిలోకి లాక్కెళ్లి, తన వద్దనున్న రూ.4,500 దోచుకెళ్లినట్లు తెలిపాడు. బాధితుని కథనం ప్రకారం సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోగా, అక్కడే ఉన్న ముగ్గురు నిందితులు పరారయ్యారు. వెంటనే పోలీసులు వారిని వెంబడించడంతో పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకున్న అనంతరం వారి వద్దనున్న రూ.4,500లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.

విచారణలో భాగంగా నిందితులను ప్రశ్నించగా.. పాదచారులను ఎవరూ కనిపించని ప్రదేశాలకు తీసుకెళ్లి వారి నుంచి విలువైన సొమ్మును దోచుకుంటున్నట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు. వీరిపై దోపిడీ కేసు నమోదు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Also Read:

BEL Engineer Jobs: నిరుద్యోగులకు తీపికబురు! 247 ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలివే!