Madhya Pradesh’s Bhopal: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారు ప్రాంతంలో ఓ శిక్షణ విమానం శనివారం కుప్పకూలింది. ఈ సంఘటనలో ముగ్గురు పైలట్లు గాయపడ్డారు. ఈ సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం సమయంలో శిక్షణ విమానం భోపాల్ నుంచి గుణా వైపు బయలుదేరింది. ఈ క్రమంలో బద్వాయి ప్రాంతంలోని బిషన్‌కేడి గ్రామంలోని పొలాల్లో విమానం కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు గాయపడ్డారని.. వారందరినీ ఆసుపత్రికి తరలించినట్లు భోపాల్ పోలీసు అధికారి అరుణ్ శర్మ తెలిపారు.
అయితే ఇటీవల కాలంలో విమానాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో ముగ్గురు పైలట్లు కూడా స్వల్పగాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: