Accident in prakasam district: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోలని త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటురు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో మంగళవారం శ్రీశైలం దైవదర్శనానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా వస్తున్న ఇన్నోవా కారు త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్ వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. ఇన్నోవా డోర్లు ఎంతసేపటికీ రాకపోవడంతో కట్ చేసి బయటకు తీశారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మృతులు గుంటూరు కృష్ణదేవరాయనగర్‌కు చెందిన సురేష్, రంగారావు, మధుకర్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పోలీసులకు పేర్కొన్నారు. కారు వేగం వల్లనే ఇంతపెద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Also Read: