Doctor Assault: కోవిడ్ కేర్ సెంటర్‌లో యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్.. వీడియో

Assam Doctor Assault: అస్సాంలోని హోజాయి జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తమ బంధువు మృతికి కారణమయ్యాడంటూ

Doctor Assault: కోవిడ్ కేర్ సెంటర్‌లో యువ వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్.. వీడియో
Assam Doctor Assault

Updated on: Jun 02, 2021 | 4:01 PM

Assam Doctor Assault: అస్సాంలోని హోజాయి జిల్లాలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తమ బంధువు మృతికి కారణమయ్యాడంటూ కొంతమంది వ్యక్తులు జూనియర్ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. జూనియర్‌ వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఓడాలి మోడల్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి చెందాడు. అయితే.. సరైన వైద్యం అందకనే తమ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించాడని.. డాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని మృతుని బంధువులు యువ వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం ఈ ఘటనకు సంబంధించి24 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్‌ చేశారు.

వైద్యులపై దాడి అనాగరిక చర్య అని.. ఫ్రంట్‌లైన్ కార్మికులపై దాడులకు పాల్పడితే.. సహించేది లేదని హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. ఈ ఘటన దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, యువ డాక్టర్‌ కుమార్‌ సేనాపతి ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతంలో సేవలందిస్తున్నారు. కాగా.. ఒక్కసారిగా దాడి జరగడంతో ఏం జరుగుతుందో ఎమో తెలియని పరిస్థితిలో డాక్టర్, సిబ్బంది ఉండిపోయారు. యువ వైద్యుడిపై దాడి ఘటనను ఐఎంఏ ఖండించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

Also Read:

Doctors die : సామాన్య పౌరుల్నే కాదు, ఎంతో మంది డాక్టర్లని సైతం బలి తీసుకుంటోన్న కరోనా మహమ్మారి

Shashi Tharoor: ‘కోవిద్ సిక్ బెడ్ పైనుంచి చెబుతున్నా’…. యుద్ధ ప్రాతిపదికన ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టండి’.. కాంగ్రెస్ నేత శశిథరూర్