దేశ రాజధానిలో దారుణం.. రైలు ఎక్కిస్తామంటూ.. మైనర్ అమ్మాయిపై అత్యాచారం..

దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న్పపటికీ.. మరోవైపు క్రైం రేటులో కూడా దూసుకుపోతోంది. తాజాగా ఓ పదహారేళ్ల యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

దేశ రాజధానిలో దారుణం.. రైలు ఎక్కిస్తామంటూ.. మైనర్ అమ్మాయిపై అత్యాచారం..
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 1:15 PM

దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న్పపటికీ.. మరోవైపు క్రైం రేటులో కూడా దూసుకుపోతోంది. తాజాగా ఓ పదహారేళ్ల యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నగరంలోని ఓ ఇంట్లో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన అమ్మాయి.. తన సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌కు చేరింది. అక్కడి నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు కూడా చేరుకుంది. అయితే అక్కడి నుంచి తన సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు వెళ్లేందుకు ఎలా వెళ్లాలో ఆలోచిస్తుండగా.. ఆమె అమాయకత్వాన్ని గుర్తించిన ముగ్గురు కామాంధులు.. ఆమెతో మాటలు కలిపారు. జార్ఖండ్‌ ట్రైన్ ఎక్కిస్తామంటూ మాయమాటలు చెప్తూ.. మెల్లిగా ఆ అమ్మాయిని వారి వెంట తీసుకెళ్లారు. మరో రైల్వే స్టేషన్‌ అనుకున్న ఆ అమ్మాయి వారితో వెళ్లగా.. ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. బలవంతంగా ఆమెకు మద్యం సేవించారు. ఆ తర్వాత.. ఆమెపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి యువతిని రోడ్డుపై వదిలిపారిపోయారు. అయితే మద్యం మత్తులో తూగుతూ ఉన్న అమ్మాయిని గమనించిన పోలీసులు.. ఆమెను ఆరా తీశారు. మహిళా పోలీసులు ప్రత్యేకంగా తీసుకెళ్లి.. విచారించి అడగ్గా.. తనపై రేప్ జరిగిన విషయం చెప్పింది. ఎక్కడ జరిగిందన్న విషయం అమ్మాయి గుర్తించకపోవడంతో.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం అమ్మాయిని చైల్డ్‌ వెల్పేరన్ కమిటీకి అప్పగించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..