15 రోజుల ఆడ శిశువును రూ. 80 వేలకు అమ్మేసిన తల్లిదండ్రులు.. పోలీసుల అదుపులో ఐదుగురు

|

Feb 07, 2022 | 7:16 PM

మూడో సారి కూడా ఆడపిల్ల పుట్టిందని15 రోజుల శిశువును 80 వేల రూపాయలకు అమ్మేసిన ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు..

15 రోజుల ఆడ శిశువును రూ. 80 వేలకు అమ్మేసిన తల్లిదండ్రులు.. పోలీసుల అదుపులో ఐదుగురు
Follow us on

ప్రస్తుతం ఆడ పిల్ల పుట్టడమే నేరమైపోతుంది. బాధ్యతతో నవమాసాలు మోసిన తర్వాత కడుపులోంచి బయటకు వచ్చిన శిశువులపై తల్లిదండ్రులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆడ పిల్ల పుట్టిందనే కారణంగా పుట్టగానే చంపేయడం, ఇతరులకు విక్రయిస్తూ పాపాలను మూటగట్టుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. నవమాసాల తర్వాత పుడమిపై వచ్చిన ఆడ శివువులకు శాపంగా మారుతోంది. ఇక మూడో సారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తల్లిదండ్రులు 15 రోజుల శిశువును 80 వేల రూపాయలకు అమ్మేసిన ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శిశువు తల్లిదండ్రులు దుర్గా ప్రియ, శ్రీనివాస్‌ ఈ ఘటనకు పాల్పడటం పలువురు మండిపడుతున్నారు. గత నెల 21న దుర్గాప్రియ ఆడపిల్లకు జన్మనిచ్చింది. మనవరాలు క్షేమ సమాచారాన్ని అడుగుదామని వచ్చిన అమ్మమ్మకి పాపను అమ్మేశామని తెలుపడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆశా వర్కర్‌ బాషమ్మ సహాయంతో బాలానగర్‌కు చెందిన కవిత అనే మహిళకు చిన్నారిని అమ్మినట్లు తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. అయితే పిల్లలు లేని తన చెల్లికి అక్క కవిత పాపను కొనుగోలు చేసి ఇచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శిశువును చైల్డ్‌ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించారు. చిన్నారిని అప్పగించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు వనస్థలిపురం పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Road Accident: ఐదు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

Tamil Nadu: కాలువలో తేలియాడుతోన్న సూటుకేసు.. తెరిచి చూడగా పోలీసులకు షాక్..