ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం.. కొత్తగా పింఛన్ దారుల ఫొటోలు ట్యాగ్..

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుకను జూన్ ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సొమ్మును అందిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మంది పెన్షనర్లు...

ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభం.. కొత్తగా పింఛన్ దారుల ఫొటోలు ట్యాగ్..
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 10:47 AM

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుకను జూన్ ఒకటో తేదీన పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సొమ్మును అందిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1421.20 కోట్లను విడుదల చేసింది. కాగా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన ఆ మొత్తాన్ని పేదరిక నిర్మూలనా సంస్థ ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేసింది. కాగా వాలంటీర్లు సోమవారం ఉదయం నుంచే పింఛనీని లబ్ధిదారులకు అందించనున్నారు.

అయితే కరోనా వైరస్ కాలం కాబట్టి.. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ తీసుతెచ్చింది. వాలంటీర్లు పెన్షన్ ఇచ్చిన తర్వాత బయోమెట్రిక్ చేయించకుండా.. దాని బదులుగా పింఛన్ దారుల ఫొటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవి, డయాలసిస్ పేషెంట్లకు డీబీటీ విధానంలో పెన్సన్ సొమ్మును జమచేస్తారు.

ఇది కూడా చదవండి:

ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు..

దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

‘ఆ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా’.. బిగ్‌బాస్ నందినీ సంచలన కామెంట్స్