కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 2.19 లక్షల మరణాలు..

|

Apr 29, 2020 | 8:16 PM

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచదేశాలు ఈ వైరస్‌ను నివారించేందుకు కట్టడి చర్యలు చేపడుతున్నా ఏ ప్రయోజనం ఉండటం లేదు. దీని తీవ్రత మరింతగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3,162,563 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 975,673 మంది కోలుకున్నారు. ఇక 19,67,588 మంది చికిత్స పొందుతున్నారు. అటు […]

కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 2.19 లక్షల మరణాలు..
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచదేశాలు ఈ వైరస్‌ను నివారించేందుకు కట్టడి చర్యలు చేపడుతున్నా ఏ ప్రయోజనం ఉండటం లేదు. దీని తీవ్రత మరింతగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3,162,563 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 975,673 మంది కోలుకున్నారు. ఇక 19,67,588 మంది చికిత్స పొందుతున్నారు. అటు మొత్తంగా మరణాల సంఖ్య 219,302కి చేరింది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతోంది. అక్కడ ప్రపంచంలో కల్లా అత్యధిక పాజిటివ్ కేసులు(1,036,529), మరణాలు(59,299) నమోదయ్యాయి.

ఇక ఇటలీలో 201,505 కేసులు ఉండగా.. ఈ వైరస్ కారణంగా 27,359 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో కరోనా వైరస్ కరాల నృత్యం చేస్తోంది. ఆ దేశంలో కోవిడ్ 19 సోకిన కేసులు 236,899కి చేరుకోగా.. మొత్తం మరణాలు 24,275కి చేరాయి. ఇక చైనాలో 82,858 కేసులుండగా… మరణాలు 4,633గా ఉన్నాయి. అటు జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్, టర్కీ, బెల్జియం దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు ఇండియా విషయానికి వస్తే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 31787 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 1008కు చేరింది. ఇక కరోనా వైరస్ నుంచి 7797 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read More: 

కిమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్.. సోదరికి కేబినెట్‌లో కీలక పదవి..

అలెర్ట్: మే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఎప్పుడెప్పుడంటే..

కరోనా రహిత భారత్ కోసం.. ఆ డేట్ దాకా ఆగాల్సిందే.!

కరోనా వేళ బయటపడ్డ పాకిస్తాన్ భారీ కుట్ర.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌తో..

హోంమంత్రి చొరవతో.. వలస కూలీల కోసం ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..

తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు..

‘నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది’.. ఇర్ఫాన్ చివరి మాటలు.. అందర్నీ ఏడిపిస్తున్నాయి..