AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా అయితే ఎలా ? రైల్వే శాఖపై దీదీ ధ్వజం..

రైల్వే మంత్రిత్వ శాఖపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ శాఖ మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి కరోనా వైరస్ ను వ్యాపింపజేస్తోందని ఆరోపించారు...

ఇలా అయితే ఎలా  ? రైల్వే శాఖపై దీదీ ధ్వజం..
Umakanth Rao
| Edited By: |

Updated on: May 27, 2020 | 8:24 PM

Share

రైల్వే మంత్రిత్వ శాఖపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ శాఖ మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి కరోనా వైరస్ ను వ్యాపింపజేస్తోందని ఆరోపించారు. కరోనాను కట్టడి చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. రైల్వే శాఖ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రానికి ఎక్కువ రైళ్లను పంపుతోందని ఆమె విమర్శించారు. ఈ రెండు రాష్ట్రాలతోను రాజకీయ డ్రామాలు ఆడుతోందన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. దేశ వ్యాప్తంగా 225 రైళ్లు పశ్చిమ బెంగాల్ చేరుతుంటాయి. అయితే వీటిలో అత్యధికంగా అంటే 41 రైళ్లు మహారాష్ట్ర నుంచే బెంగాల్ చేరతాయి. ఆ రాష్ట్రం నుంచి వలస వఛ్చిన కార్మికులు చాలామంది మాల్దా, ముర్షీదాబాద్, దినాజ్ పూర్ వంటి ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నారు. వీరిలో చాలామంది కరోనా వైరస్ కు గురైనవారే. దీంతో ఈ రాష్ట్రంలో కరోనా జోరు పెరిగింది. అన్ని రైళ్ళూ తమ రాష్ట్రానికి చేరితే ఈ కేసులు ఇంకా పెరిగిపోతాయని బెంగాల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
అద్దె ఇంటి ముందు యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..?
అద్దె ఇంటి ముందు యజమాని సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయవచ్చా..?
 లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ
 లాల్ దర్వాజా బోనాల్లో సందడి చేసిన విజయ్ దేవరకొండ
తెలంగాణ ప్రజలకు ఒకే రోజు 10 శుభవార్తలు.. ఆగస్ట్‌ 15న కొత్త పథకాలు
తెలంగాణ ప్రజలకు ఒకే రోజు 10 శుభవార్తలు.. ఆగస్ట్‌ 15న కొత్త పథకాలు
కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో విజయం
కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో విజయం
అతను భారత్‌కు దొరికిన ఆణిముత్యం.. వయసుతో మీకేం పని: బ్రెట్ లీ
అతను భారత్‌కు దొరికిన ఆణిముత్యం.. వయసుతో మీకేం పని: బ్రెట్ లీ
ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా
ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా
స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ వింగ్స్.. వీకెండ్ స్పెషల్ రెసిపీ!
స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ వింగ్స్.. వీకెండ్ స్పెషల్ రెసిపీ!
శ్రీలంకతో తొలి టెస్ట్‌.. సుదర్శన్ స్థానంలో గుంటూరోడు..
శ్రీలంకతో తొలి టెస్ట్‌.. సుదర్శన్ స్థానంలో గుంటూరోడు..
విదేశాల నుంచి భారత్‌కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..?
విదేశాల నుంచి భారత్‌కు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు..?
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100+ మిలియన్ వ్యూస్‌
ఆహా ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు సినిమా.. 100+ మిలియన్ వ్యూస్‌