కరోనా దుమ్ముదులిపే డీఆర్‌డీవో రామబాణం

|

May 05, 2020 | 7:14 AM

భారత ప్రభుత్వ రక్షణ సంస్థ డీఆర్‌డీవో మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. దానికి ‘యూవీ బ్లాస్టర్’ అని నామ‌క‌ర‌ణం చేసింది. ఈ పరికరం ద్వారా వైరస్ వ్యాప్తి

కరోనా దుమ్ముదులిపే డీఆర్‌డీవో రామబాణం
Follow us on
కరోనా వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు ఇంతకాలం సానిటైజర్లు, ఫేస్ మాస్కులు, గ్లౌజుల మీదనే ఆధారపడ్డాము. కానీ, ఇప్పుడు దానికి డీఆర్‌డీవో రామ‌బాణం వ‌చ్చేసింది. భారత ప్రభుత్వ రక్షణ సంస్థ డీఆర్‌డీవో మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. దానికి ‘యూవీ బ్లాస్టర్’ అని నామ‌క‌ర‌ణం చేసింది. ఈ పరికరం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడవచ్చని పేర్కొంటోంది. ‘యూవీ బ్లాస్టర్’ పరికరం యూవీ(అతినీలలోహిత) కిరణాల సాయంతో పనిచేస్తుంది.
కంప్యూటర్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఉపకరణాల ఉపరితలాలను అతినీల లోహిత(యూవీ) కిరణాలతో శుద్ధిచేయగల టవర్‌ను డీఆర్‌డీఓ- లేజర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ రూపొందించింది. రసాయనాలు, క్రిమిసంహారకాలతో శుద్ధిచేసేందుకు వీలుపడని ప్రతీ వస్తువును, పరికరాన్ని ఇది 360 డిగ్రీల్లో యూవీ కిరణాలతో శుభ్రం చేయగలదు. ఓ ట‌వ‌ర్ ఆకారంలో 43 వాట్ల యూవీ-సీ బ‌ల్బులు ఉంటాయి. ఇవి 254నానోమీట‌ర్ త‌రంగ దైర్ఘ్యంతో ప‌నిచేస్తోంది. ఈ ప‌రిక‌రం వైఫై ద్వారా ఆప‌రేట్ చేసే వీలుంది. 12 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు కలిగిన గదిని వైరస్‌ రహితంగా శానిటైజ్ చేసేందుకు 10 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది.  400 చదరపు అడుగుల ఏరియా శుద్ధికి అరగంట సమయాన్ని తీసుకుంటుంది.